మొత్తానికి 'డిజె' (దువ్వాడ జగన్నాథం) ఓ ఊపు ఊపుతున్నాడు. వివాదాలపరంగా కూడా ప్రమోషన్ పొందుతున్నాడు. ప్రమోషన్లలో వేగం పెరిగింది. ఇక ఈ చిత్రంలోని పాటలో సరే.. సినిమాలో కూడా ఏమైనా బ్రాహ్మణులను కించపరిచే సీన్లు ఉన్నాయా అనే చర్చ విపరీతంగా సాగుతోంది. ఇక బన్నీ అంటే డ్యాన్స్‌ల్లోఇరగదీస్తాడు. ఆయనతో కలిసి పాటల్లో స్టెప్స్ వేయాలంటే హీరోయిన్ల పని అంతే సంగతులు, మనోడి మూమెంట్స్, టైమింగ్‌ను క్యాచ్ చేయడం అంత సులభం కాదు.
బన్నీతో సరితూగకపోతే మిస్ మ్యాచ్ కావడం ఖాయం. కాబట్టే మంచి డ్యాన్సర్లయిన బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వంటి వారితో చాన్స్ వచ్చిందంటే ఆనందంతో పాటు ఎంతో కష్టమూ దాగుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా 'డిజె'లో బన్నీని పూజాహెగ్డే బాగానే హ్యాండిల్ చేసిందనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. మరోపక్క ఈ చిత్రంపై మరోసారి విమర్శల వర్షం మొదలైంది. నిర్మాతలు ఆడియోలను డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేసే సౌలభ్యంఉన్నప్పటికీ వీడియో ప్రోమోలను సైతం విడుదల చేయాలన్నా కూడా సెన్సార్‌బోర్డ్ అనుమతి తప్పనిసరి. ఇక మొదటి పాట 'శరణం భజే...భజే..డిజె' ఆడియో విడుదలైంది. రెండో పాట 'గుడిలో బడిలో మడిలో' వీడియో ప్రోమోను దిల్‌రాజు తన అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ద్వారా రిలీజ్ చేశాడు. మరి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా...! అనే విమర్శలు మొదలయ్యాయి.