Advertisementt

మన స్టార్స్‌ మారుతున్నారు..!

Mon 05th Jun 2017 02:41 PM
jr ntr,ram charan,jai lava kusa movie,heroes fans,sukumar,rc11cmovie  మన స్టార్స్‌ మారుతున్నారు..!
Our stars are changing! మన స్టార్స్‌ మారుతున్నారు..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి యువరక్తం నిండిన మన యంగ్‌స్టార్స్‌ చాలా రఫ్‌గా బిహేవ్‌ చేసేవారు. పెద్దల నుంచి మీడియా వరకు, అభిమానుల పట్ల కూడా వాళ్ల వైఖరి అలాగే ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే వారు మారుతున్నారు. మరి పెళ్లిలు, పెళ్లాల పుణ్యమో, వయసుతో పాటు పెరిగిన సహనమో తెలియదు కానీ అభిమానులను బాగా చూసుకుంటున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలోని ఎక్కడెక్కడి నుండో తనను చూడటానికి ఎన్నో వ్యయప్రయాసలు పడి వచ్చిన వారిని చూసి ఎన్టీఆర్‌ విసుక్కునే వాడు. 

చరణ్‌ పరిస్థితి కూడా అదే. కానీ ఈమద్య ఎన్టీఆర్‌ తన షూటింగ్‌ బిజీలో కూడా తన కోసం అభిమానులు వస్తే వారికి ప్రత్యేకంగా సమయం కేటాయించి, యోగక్షేమాలు అడుగుతూ, ఫొటోలు దిగిపంపుతున్నాడు. ఇక ఆమధ్య తన కొత్త చిత్రం షూటింగ్‌ సమయంలో బిజీగా ఉన్న రామ్‌ చరణ్‌ కారును అభిమానులు అడ్డుకున్నారు. వారి ఆతృత గమనించిన చరణ్‌ కారుదిగి, తిన్నగా, స్మూత్‌గా క్లాస్‌ పీకాడు. దాంతో ఫ్యాన్స్‌ కూడా సారీ చెప్పారు. నా పని కంటే ఓ గంట ముందు వస్తే హ్యాపీగా ఫొటోలు దిగేవారం కదా..! అంటూ భుజం చరిచాడు. అంతటితో ఆగకుండా ఇప్పటికైనా ఏం మునిగిపోలేదు.. రండి అంటూ వారితో ఫొటోలు దిగి సంతోషపెట్టాడు. మొత్తానికి అభిమానుల మానసిక పరిస్థితిని స్టార్స్‌ అర్ధం చేసుకోవడం ఆనందకరమైన మార్పుగా చెప్పుకోవచ్చు. 

Our stars are changing!:

Our youngsters, once junior NTR and Ram Charan, have been bored too. From the elders to the media, the attitude of the fans was also the same. But NTR is also shooting his fans in the shooting festivities for him, especially for the time they are allocating and asking for photos. Ram Charan also same

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ