బాహుబలితో చరిత్రలో నిలిచిపోయే సినిమాని తెరకెక్కించిన రాజమౌళి ఇప్పుడు తన జీవితంలో ఎప్పటికి మరిచిపోలేకుండా ఉండే కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నాడు. హైదరాబాదుకు దూరంగా ఉన్న దొనకొండలో తన 100 ఎకరాల పొలంలో ఒక ఫామ్ హౌస్ ని నిమించుకోవాలని రాజమౌళి ఎప్పటి నుండో కలలు కంటున్నాడు.100 ఏకరాల స్థలంలో పచ్చని పొలాల మధ్య పల్లెటూరు ప్రాంతంలా ఉన్న అక్కడి వాతావరణంలో ఒక చక్కటి ఫామ్ హౌస్ ని కట్టుకుని సేదదీరడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు.
మరి సినిమా కోసమే ఎంతో అందమైన ఇంటి సెట్స్, బాహుబలి కోసం మాహిష్మతి రాజ్యం వంటి రాజ్యాల సెట్స్ ని అద్భుతంగా డిజైన్ చేయించిన రాజమౌళి ఇక తన కలల సౌధం నిర్మించడానికి ఎంతలాంటి టెక్నలాజితో అపురూపమైన ఇంటిని కట్టనున్నాడనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ ఫామ్ హౌస్ కి సూపర్బ్ డిజైన్ చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మరి డైరెక్టర్ గా విజయపధంలో దూసుకుపోతున్న రాజమౌళి తన ఫ్యామిలీ కోసం ఎంత చక్కటి ఫామ్ హౌస్ నిర్మాణాన్ని బాహుమతిగా ఇవ్వబోతున్నాడో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.
ఇక రాజమౌళితో పాటే దొనకొండ దగ్గర రాజమౌళి అన్న కీరవాణి, రాజమౌళి ఫ్రెండ్ సాయి కొర్రపాటి కూడా ఇళ్ళు నిర్మించుకోవడానికి కొన్ని స్థలాలు కొనుగోలు చేశారట. మరి వీరంతా అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఒక చిన్న విలేజ్ లాంటి ప్రాంతం ఏర్పడిపోతుందని అక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారట.