Advertisementt

భరత్ కి తండ్రిగా శరత్ కుమార్ ...!!

Mon 05th Jun 2017 11:56 AM
mahesh babu,sarath kumar,bharath anu nenu movie,koratala shiva,kaira advani  భరత్ కి తండ్రిగా శరత్ కుమార్ ...!!
Sarath Kumar as Mahesh's Father!! భరత్ కి తండ్రిగా శరత్ కుమార్ ...!!
Advertisement
Ads by CJ

'శ్రీమంతుడు' చిత్రం హిట్ తర్వాత మహేష్ - కొరటాల కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. 'శ్రీమంతుడు'తో బంపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు మరోమారు కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. మహేష్ తాజా చిత్రం 'స్పైడర్' షూటింగ్ పూర్తి కాకుండానే వీరి కాంబినేషన్లోని మూవీ పట్టాలెక్కేసింది. అయితే కొరటాల, మహేష్ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ చేసేసారు. 'భరత్ అను నేను' అనే టైటిల్ మహేష్, కొరటాల చిత్రానికి ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన 'భరత్ అను నేను' సెట్స్ లో ఈనెల నుండి మహేష్ జాయిన్ కాబోతున్నాడు. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కైరా అధ్వానిని ఫైనల్ చేశారు. 

పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్‌బాబు  సీఎంగా కనిపిస్తాడనే ప్రచారమైతే సాగుతోంది. హీరోకి తండ్రిగా ఇంపార్టెంట్ రోల్‌లో ఓ సీనియర్ హీరోని ఈ చిత్రానికి కొరటాల సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆయనెవరోకాదు తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్. ఈ చిత్రంలో మహేష్ కి ఫాదర్ గా శరత్ కుమార్ పవఫుల్ రోల్ పోషించనున్నాడట. ఇదివరకే శరత్ కుమార్ 'బన్నీ' సినిమాలో అల్లు అర్జున్ కి తండ్రిగా నటించాడు.  60 ప్లస్‌లో పర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో వుండే శరత్ కుమార్‌ని ఈ రోల్ కోసం ఫైనల్ చేసాడట కొరటాల.  మరి 'శ్రీమంతుడు'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ - కొరటాల కాంబినేషన్ ఇప్పుడు 'భరత్ అను నేను' చిత్రం మొదలు పెట్టకముందే అంచనాలను పెంచేశారు.

Sarath Kumar as Mahesh's Father!!:

Senior Tamil hero Sarathkumar has been roped in for Mahesh Babu father role in 'Bharath Anu Nenu' Film. The Latest Buzz suggests that SarathKumar has a Powerful Role.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ