Advertisementt

ఎన్టీఆర్ కి కరెక్ట్ మొగుడు ఈ బుడతడే..!!

Mon 05th Jun 2017 11:49 AM
manchu manoj,ntr,ntr son abhay ram,ntr house,abhay love with manoj  ఎన్టీఆర్ కి కరెక్ట్ మొగుడు ఈ బుడతడే..!!
Abhay Ram Correct Mogudu of NTR!! ఎన్టీఆర్ కి కరెక్ట్ మొగుడు ఈ బుడతడే..!!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో ఎన్టీఆర్ - మంచు మనోజ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. వీరిరువురు తరుచూ పార్టీస్ లో, తమ తమ ఇళ్లల్లో ఎప్పటికప్పుడు కలుస్తూనే వుంటారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో భాగంగానే మనోజ్ ఈమధ్యన ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాడట. అయితే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లగా అక్కడ ఎన్టీఆర్ కొడుకు బుల్లి అభయ్ రామ్, మంచు మనోజ్ కి అతిధి సత్కారాలు చేసి మరీ మంచి నీళ్లు అందించాడంట. మంచి నీళ్లు మనోజ్ కి అందించడమే కాకుండా ఆ నీళ్ళని మనోజ్ తో తాగించిమరీ వదిలిపెట్టాడు. ఇక ఈ పరిణామానికి అబ్బురపడ్డ మనోజ్, తారక్ కి కరెక్ట్ మొగుడు అభయ్ అంటూ... సరదాగా కామెంట్ చెయ్యడమే కాకుండా అభయ్ రామ్ మంచి నీళ్లు మనోజ్ కి తాగిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచి క్యాప్షన్ కూడా పెట్టాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎనేర్జికి కి పెట్టింది పేరు. అలాంటి ఎన్టీఆర్ కడుపున అంతే ఎనర్జీ ఉన్న అభయ రామ్ పుట్టాడంటూ మనోజ్ చమత్కరిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎనేర్జి లెవెల్స్ కంటే అభయ్ రామ్ ఎనేర్జి లెవెల్స్ 100  రేట్లు ఎక్కువ అని అంటున్నాడు మనోజ్. మరి అంత ముద్దు ముద్దు పనులు చేసుంటే చూసేవాళ్ళు ఇలానే అంటారు కదా. అలా మనోజ్ కి అభయ్ మంచి నీళ్లు తాగిస్తున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మరి సినిమా హీరోలంతా ఇలా స్నేహ సంబంధాలను కొనసాగిస్తుంటే బయట అభిమానులు మాత్రం మా హీరోలు గొప్ప అంటే.... మా హీరోలు గొప్ప అంటూ తన్నుకు చస్తుంటారు. అభిమానులు కూడా ఇలా స్నేహ భావంతో మెలిగితే దానికన్నా మంచి పరిణామం ఏముంటుంది.

Abhay Ram Correct Mogudu of NTR!!:

Manchu Manoj Describes Abhay Ram as NTR's Perfect Son. Abhay Ram Invited Manchu Manoj With a Glass Of Water Showing Love to Manoj.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ