Advertisementt

జై లవ కుశ యమా ఫాస్ట్ గా సిద్ధమవుతుందిగా!

Sun 04th Jun 2017 05:45 PM
jr ntr,director bobby,producer kalyan ram,jai lava kusa movie  జై లవ కుశ యమా ఫాస్ట్ గా సిద్ధమవుతుందిగా!
Jai Lava Kusa Teaser Date! జై లవ కుశ యమా ఫాస్ట్ గా సిద్ధమవుతుందిగా!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. చిత్రం మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే మోషన్ పోస్టర్ తో 'జై లవ కుశ' టైటిల్ ని రివీల్ చేసిన చిత్ర యూనిట్ మళ్లీ నెలన్నర గ్యాప్ లో ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా 'జై లవ కుశ ఫస్ట్ లుక్' ని విడుదల చేసింది. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎన్టీఆర్ గత చిత్రం 'జనతా గ్యారేజ్' విడుదల టైమ్ కే అంటే సెప్టెంబర్ 1న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా రాశి ఖన్నా, నివేత థామస్, నందిత లు నటిస్తున్నారు.

యమా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటున్న 'జై లవ కుశ' ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. 'జై లవ కుశ' టీజర్ ని రంజాన్ కానుకగా ఈ నెల 21న విడుదల చేస్తారని చెబుతున్నారు. మరి సినిమా మొదలు పెట్టి పట్టుమని మూడు నెలలు గడవకముందే ఇలా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ లతో సందడి చేస్తూ మంచి పబ్లిసిటీని ఈ చిత్రానికి అందిస్తున్నారు. మరి నందమూరి అభిమానులకి సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఇస్తూ వారిలో జోష్ నింపుతున్నాడు యంగ్ టైగర్.

Jai Lava Kusa Teaser Date!:

Young Tiger NTR's first look from Jai Lava Kusa received good response from movie goers. Team Jai Lava Kusa ensures timely release of first looks and motion posters of the movie. And now, they are all set to release the teaser of the movie. Bobby is directing the movie on Kalyan Ram's NTR Arts. September 1 is the scheduled date of release.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ