తెలంగాణలో టిఆర్‌ఎస్‌కి పోటీగా వచ్చే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్, టిడిపిలు విడిగానే పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో తెలంగాణలో టిడిపి పరిస్థితి అదే. ఇక లెఫ్ట్ పార్టీలు ఇంకా ఎటూ తేల్చలేదు. ఇక ఏపీలో చంద్రబాబు-బిజెపిలకు 2014లో మద్దతు తెలిపిన పవన్ పవర్ బాగా పనిచేసిందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తేల్చారు.
ఇక ఏపీ విషయానికి వస్తే ఎవరు ఎన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లో టిడిపి-బిజెపిలు మరోసారి జట్టు కడతాయని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ను పట్టించుకునే వారే లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో లెఫ్ట్ పార్టీలు జనసేనతో పొత్తుకు సిద్దంగా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు జగన్ కూడా లెఫ్ట్‌పై కన్నేశాడు. కానీ జగన్ ఇటీవల మోదీని కలిసి ఆయనపై ప్రశంసలు కురిపించడం లెఫ్ట్‌నేతలకు మింగుడుపడటం లేదు. కానీ ఎవరితో అభిప్రాయబేధాలున్నప్పటికీ టిడిపి-బిజెపి వ్యతిరేక కూటమి విషయంలో జగనే ముందడుగు వేయాలని, అంతేగానీ ఎవరు నాకు అవసరం లేదు.
వచ్చే ఎన్నికల్లో బాబు వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని మరోసారి జగన్ అత్యుత్సాహం చూపిస్తే అది వైసీపీ గెలుపుకే దెబ్బ అని ప్రశాంత్‌కిషోర్ జగన్‌కి విలువైన సలహాలను ఇచ్చాడట. తానే ముందడుగు వేసి, ఇప్పటి నుంచే పవన్, లెఫ్ట్‌లతో పాటు వీలుంటే కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోవాలని, కానీ కాంగ్రెస్ విషయంలో వ్యతిరేకత ఏపీ ప్రజల్లో తగ్గిందా? లేదా? అనే విషయాన్ని గమనించాలని, తద్వారా టిడిపి వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాల్సిన పని జగన్ భుజలపైనే ఉందని ప్రశాంత్ తేలుస్తున్నాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు, టిడిపిల ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రత్యేకహోదా అంశాలపైనే ఎన్నికలకు వెళ్లాలని ప్రశాంత్‌కిషోర్ జగన్‌కి హితబోధ చేసినట్లు సమాచారం. మరి ఈ విషయంలో జగన్ వైఖరి ఏమిటో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడి ఉంది....!