Advertisementt

బంగారు తెలంగాణ అంటే ఇదేనా కేసీఆర్‌..?

Sun 04th Jun 2017 01:42 PM
telangana,trs,kcr,bangaru telangana,ktr,amit shah,rahul gandhi  బంగారు తెలంగాణ అంటే ఇదేనా కేసీఆర్‌..?
KCR This is Golden Telangana? బంగారు తెలంగాణ అంటే ఇదేనా కేసీఆర్‌..?
Advertisement
Ads by CJ

ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ తెస్తానన్నావు. దళితుడిని ముఖ్యమంత్రిని చేసి పెద్ద మాదిగలా ఉంటానన్నావు. ఓట్లు వేయగానే సీటెక్కి కూర్చున్నావు. తనకు చేదోడు వాదోడుగా నిలిచి, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రోఫెసర్‌ కోదండరాంను నీ కొడుకు కేటీఆర్‌ చేతనే తిట్టిస్తున్నావు. ఎంత కాలం..! ఈ పోకడ.. నీది కుటుంబపాలన అని రాహుల్‌ విమర్శిస్తే సరైన సమాధానం చెప్పకుండా నువ్వు కూడా దొంగవే కదా???కాంగ్రెస్‌ది కూడా కుటుంట పాలనే కదా? అని విమర్శిస్తున్నావంటే నీవు దొంగనేనని ఒప్పుకున్నట్లే. 

తెలంగాణలో పర్యటించిన అమిషాపై దూకుకు పెంచావు. మోదీకి సలాం చేస్తున్నావు. ఎంఐఎంను ఆకాశానికెత్తుతున్నావు. తాజాగా రాహుల్‌గాంధీ వచ్చిన సంగారెడ్డి సభ బాగా సక్సెస్‌ కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. తెలంగాణను మోసం చేసింది ఆంధ్రా నాయకులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలేనన్నవిషయాన్ని మరిచి రాష్ట్ర విభజన సమయంలో సామాన్య అంధ్రులను ఎక్కించి రెచ్చగొట్టావు. కర్రీ పాయింట్లు పెట్టుకునే వారు. దోసె, వడ, ఇడ్లీ తినే వారు వద్దన్నావు. ఆంధ్రా దేవుళ్లను కూడా వదిలిపెట్టలేదు. మరి నేడు అదే ఆంధ్రా బూర్జువా పారిశ్రామిక వేత్తలకు ఎర్రతివాచీలు పరుస్తున్నావు. 

మియాపూర్‌ కుంభకోణంలో ఎవరు ఉన్నారు? అనేది తేల్చాల్సింది నీ ప్రభుత్వ వర్గాలు కాదు. ఈ పరిస్థితి చేయిదాటి పోయింది. సిబిఐ విచారణ ఎందుకు చేయించవు? పేదలకు డబుల్‌బెడ్‌ర్రూంలు కట్టలేక నీవు మాత్రం బుల్లెట్‌ప్రూఫ్‌ బాత్రూం కట్టుకున్నావు? తెలంగాణకు కాపలా కుక్కను అని చెప్పే నువ్వు బకాసరుడిగా మారుతున్నావు. కాంగ్రెస్‌ సీినియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ చెప్పినట్లు ఎంపీ కవిత అపార్ట్‌మెంట్‌ స్థాయి నుంచి కోట్ల విలువ చేసే విల్లాలలోకి ఎలా మారగలిగింది? తలసానిని అడ్డుపెట్టి కేసీఆర్‌ కుటుంబం మరీ ముఖ్యంగా కవిత భర్త కన్నారావులు చేస్తున్న అఘాయిత్యాలపై ఎందుకు తడబాటు.? 

నీవే సికింద్రాబాద్‌ ఎంపీ సీటు ఇస్తానన్నా కూడా వద్దని దండం పెట్టిన కోదండరాంపై నేడు రాజకీయ లబ్ది అనే పదాన్ని వాడుతున్నారు. కవిత, కన్నారావుల ఆస్తుల విలువ ఎంతో ప్రకటించే దమ్ముందా? ఎందుకయ్యా విభజించి పాలించు సూత్రం ఎంతో కాలం సాగదు. విడిపోయిన జర్మనీ దేశాల గోడల్నే ప్రజలు పగలగొట్టి ఏకం అవుతున్నారు....! 

KCR This is Golden Telangana?:

If you get a separate state, you will bring gold to Telangana. You can make the Dalit chief the chief minister. Your son KTR has been reprimanded by the professor who played a key role in Telangana practice.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ