భారతదేశాన్ని పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య ఏమిటి? అంటే ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు. కానీ నిజంగా ఇండియా ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే... నిజమైన మేధావులు మౌనంగా ఉండటం, కుహానా మేదావులు తయారవ్వడం, పుస్తకాలతో, తమ రచనతో, తమ వాదనలతో సామాన్య ప్రజల్లో విషభీజాల నాటడమే అసలు సమస్య. నిజమైన మేధావుల మౌనం అణుబాంబులు వేల కొద్ది చేసే నష్టం కంటే ఎక్కువ నష్టం చేకూరుస్తుంది.
కంచె ఐలయ్య వంటి వారు 'వై ఐయామ్ నాట్ ఎ హిందు' అంటారు. మీడియా కూడా అలాంటి వివాదాదస్పద వ్యాఖ్యలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం చెడుధోరణి, ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించే హైదరాబాద్‌కి చెందిన మేధావి, మాజీ ఎమ్మెల్సీ, ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం ప్రొఫెసర్ నాగేశ్వర్ వాస్తవాలు మాట్లాడుతున్నాడని చెప్పి మీడియా వారు ఆయనను తమ విశ్లేషణలకు పిలవడమే మానేశారు.
ఆయన మాటలు అంత కఠువుగా ఉంటాయి. దాని సారం మహాసముద్రం. లక్షలాది గొంతుకల వేదనను ఆయన ఒక్క మాటలో చెప్పేస్తారు. కానీ వారిని అణగదొక్కుతున్నారు. రేపు ఎవరైనా కంచె ఐలయ్యను ఉద్దేశించి 'వై యు ఆర్ నాట్ ఏ హ్యూమన్' అనే పుస్తకం రాస్తే ఐలయ్య ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇక కమల్ హాసన్ కూడా అంతే. తానో మేధావిని అని నిరూపించుకోవడానికి గాంధీ మీద, రామాయణం, మహాభారతాల నుంచి తమిళనాడు రాజకీయాలు, రజినీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు, గోమాంసం నుంచి అన్నింటిలో వేలు పెడుతూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇండియాకు సహజీవిన సంస్కృతిని తెచ్చిన వారిలో ఆయన కూడా ఒకరు.
ఇక ఆయన తనకేదైనా ఇబ్బంది వస్తే.. అది ప్రపంచం బాధగా భావించి.. ఇలా అయితే నేను దేశం విడిచిపోతాను.. ఇక సినిమాలు చేయను అని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. విశ్వరూపం సమయంలో తన ఏడుపుతో , తన మాటలతో కావాల్సినంత సింపతీ సాధించాడు. ఇక తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లు వల్ల నిర్మాతలకు నష్టం కలుగుతుందని, ఇలాగైతే తాను ఇక సినిమాలు చేయనని మరోసారి బెదిరించాడు. కేంద్రం విశాలభారతాన్ని ఏకం చేసేందుకే ఓకే పన్ను విధానాన్నితెచ్చింది. దీనివల్ల తెలుగు సినిమాలకు, తమిళ సినిమాల నిర్మాతలకు నష్టమే. ఇంతకాలం ప్రజల నుంచి ఎక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్ముకుని, ప్రభుత్వాలకు అసలు రేటులో కేవలం 14శాతం వినోదపు పన్ను కడుతున్న తెలుగు నిర్మాతలకు, ఇక తమిళంలోనే టైటిల్, క్లీన్‌యు సర్టిఫికేట్ ఉంటే అసలు పన్నే కట్టకుండా తమిళ నిర్మాతలు ఆనందించారు.
కానీ మహారాష్ట్ర తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలలో 48శాతం ప్రభుత్వానికి వినోదపు పన్ను కట్టేవారు. ఇక జీఎస్టీ వల్ల థియేటర్ల టిక్కెట్లు రేట్లు పెరగడంతో పాటు నిర్మాతలు ప్రభుత్వాలకు కట్టే వినోదపు పన్ను కూడా దక్షిణాదిన కాస్త కష్టంగా, ఉత్తరాది వారికి కాస్త వెసులుబాటులో ఉంటుంది. కానీ దీనిని కమల్‌తో పాటు తమిళ మేకర్స్, తెలుగు నిర్మాతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ కేంద్రం వీరి మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కువ టిక్కెట్లకు ప్రేక్షకులను దోచుకుంటూ, ప్రభుత్వాలకు పన్ను ఎగ్గొట్టి, తమ సొంత ప్రయోజనాలు చూసుకునే నిర్మాతలకు ఇది పెద్ద చెంపపెట్టు. పది రూపాయలు టిక్కెట్ రేటు పెరిగినా అది ప్రభుత్వ ఖజానాకు పోతుంటే ప్రేక్షకుడు సంతోషిస్తాడు.
కానీ వందలకు వందలు దోచుచుని మన డబ్బుతో ఎవరో కోటీశ్వరులు కావడం మాత్రం తప్పు. ప్రతి మంచినటుడు మంచి మనిషి అయి ఉండాల్సిన అవసరం లేదు. పక్కాగా చెప్పాలంటే కమల్‌ని గొప్పనటుడిగా గౌరవిస్తాం గానీ రజినీలా మౌనంగా ఉండకుండా తన నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం గెటౌట్ ఫ్రమ్ ఇండియా కమల్..! యూ ఆర్ లుకింగ్ లైక్ వర్మ అండ్ కమల్‌ఖాన్.