Advertisementt

ఆ అగ్రిమెంట్ ప్రస్తుతానికి సస్పెన్సు..!

Sun 04th Jun 2017 01:04 PM
sangamithra movie,shruti haasan,anushka shetty,tamanna,kajal,deepika padukone,2 years agreement  ఆ అగ్రిమెంట్ ప్రస్తుతానికి సస్పెన్సు..!
Deepika Padukone 2 Years Agreement on Sangamithra Movie! ఆ అగ్రిమెంట్ ప్రస్తుతానికి సస్పెన్సు..!
Advertisement
Ads by CJ

శృతి హాసన్ తో సంఘమిత్రాకు డీలింగ్స్ ముగిసినట్టే. ఆ ప్రాజెక్ట్ నుండి శృతి తప్పుకున్న తర్వాత 'సంఘమిత్ర' టైటిల్ రోల్ ఈ హీరోయిన్స్ పోషిస్తారేమో అనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. బాహుబలితో అనుష్క, తమన్నా లిద్దరూ కత్తి యుద్ధం గట్రా నేర్చుకుని ఉన్నారు గనక సంఘమిత్ర పాత్ర వీరిరువురిలో ఎవరినో ఒకరిని వరిస్తుందని అనుకున్నారు. అలాగే మగధీరతో యుద్ధవిన్యాసాలకు పదును పెట్టిన కాజల్ పేరు కూడా గట్టిగానే వినబడింది. ఇదంతా ఇలా ఉంటే చిన్న చిన్న హీరోయిన్ పాత్రలు వేసుకుని ఐటెం సాంగ్స్ చేసుకునే నీతూ చంద్ర తనకు సంఘమిత్ర సినిమాలో ఛాన్స్ ఇస్తే ఇరగదీస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది.

అయితే ఇప్పుడు సంఘమిత్ర టీమ్ టైటిల్ రోల్ కి గాను బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనెను సంప్రదిస్తున్నట్లు వార్హలొస్తున్నాయి. అనుష్క, తమన్నా కంటే బాజీరావ్ మస్తానితో మంచి పేరు కొట్టేసిన దీపికా అయితే బావుంటుందని అనుకుంటున్నారట. ఇప్పుడు కూడా దీపికా ఒక చారిత్రాత్మక చిత్రంలో నటిస్తుంది. సంజయ్ లీలా భన్సాలీ లాంటి టాప్ డైరెక్టర్ రూపొందిస్తున్న పద్మావతిలో నటిస్తుంది దీపికా పదుకొనె. అందుకే సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న  250  కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకొనె నటిస్తే సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని సంఘమిత్ర టీమ్ భావిస్తోందట.

మరి సంఘమిత్ర చిత్రం చెయ్యాలంటేఏ హీరోయిన్ అయినా రెండేళ్లు కేటాయించాల్సి వస్తుంది. అలా రెండేళ్లు ఒకే ప్రాజెక్ట్ మీద ఉండడం అంటే హీరోయిన్స్ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. మరి రెండేళ్ల అగ్రిమెంట్ కి దీపికా ఒప్పుకుని సంఘమిత్ర చేస్తుందా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్సు.

Deepika Padukone 2 Years Agreement on Sangamithra Movie!:

The Dalits are ending to Sangamithra's Shruti Haasan. After the shift from the project, the 'Sangamitra' title roll was the promotion of these heroines posiestaramo. But now Sangamithra team will be teaming up with Deepika Padukone, She is the heroine of Bollywood.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ