Advertisementt

ప్రభాస్ కి హీరోయిన్ గా ఈ అమ్మడేనా..?

Sun 04th Jun 2017 01:04 PM
prabhas,saaho movie,uv creations banner,neil nitin mukesh,pooja hegde  ప్రభాస్ కి  హీరోయిన్ గా ఈ అమ్మడేనా..?
Pooja Hegde in Saaho Movie! ప్రభాస్ కి హీరోయిన్ గా ఈ అమ్మడేనా..?
Advertisement
Ads by CJ

యువి క్రియేషన్స్ వారు 150  కోట్ల భారీ బడ్జెట్ తో సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా 'సాహో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చెయ్యాలని వారు భావిస్తున్నారు. ఏదో హడావిడిగా 'సాహో' చిత్రం టీజర్ ని రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన 'సాహో' టీమ్ ఇంత వరకు ఆఫీసియల్ గా సినిమాని పట్టాలెక్కించలేదు. కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ 'సాహో' చిత్రాన్ని పట్టాలికించే పనిలో తొందర పడుతుందట. అందుకే ప్రభాస్ పక్కన హీరోయిన్ కోసం ఇప్పటి దాకా జాప్యం చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రభాస్ కి జోడిని ఫైనల్ చేసిందని సమాచారం.

ఇప్పటి వరకు బాలీవుడ్ నుండి హీరోయిన్ ని దిగుమతి చేసుకోవాలని భావించిన 'సాహో' యూనిట్...అది వర్కౌట్ కాక... ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సినిమాలో మెరిసిన భామను తీసుకుంటున్నారట. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ లో 'ముకుందా' తో ఎంట్రీ ఇచ్చి నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' అంటూ అంటూ బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ పక్కన 'మోహింజదారో'లో  మెప్పించి ఇప్పుడు అల్లు అర్జున్ పక్కన 'డీజే' లో హంగామా చేస్తున్న పూజ హెగ్డేని 'సాహో' లో ప్రభాస్ జోడి గా ఫైనల్ చేశారనే వార్తలొస్తున్నాయి. 

ఎలాగూ బాలీవుడ్ లో 'సాహో' ని విడుదల చేసి గట్టిగా దండుకోవాలంటే హీరోయిన్ కూడా బాలీవుడ్ కి పరిచయమైన భామ అయితే బావుంటుందని భావించిన 'సాహో' యూనిట్ కి హ్రితిక్ రోషన్ పక్కన 'మోహింజాధారో'లో నటించిన పూజ అయితే బావుంటుందని ఆమెనే ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ప్రభాస్ కి విలన్ ని కూడా బాలీవుడ్ కుర్రాడిని ఎంపిక చేశారు. 'ప్రేమ్ రతన్ ధన్ పాయే, వజీర్' చిత్రాల్లో విలన్ గా మెప్పించిన నిల్ నితిన్ ముఖేష్ ని ప్రభాస్ విలన్ గా సెట్ చేశారు 'సాహో' చిత్ర యూనిట్.

Pooja Hegde in Saaho Movie!:

UV Creations are in the direction of Sujit with a budget of 150 crores Prabhas is the hero of the film 'Saaho'. They are expected to release this film next summer. Prabhas's next film has been delayed till now and Prabhas ki Jodi has been finalized.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ