పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటిస్తున్నారు. కాటమరాయుడు చిత్రం ప్లాపుతో దెబ్బ తిన్న పవన్ ఈ చిత్రంతో హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొదట్లో ఎలాగైనా దసరాకి కంప్లీట్ చేసేసి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం సంక్రాతి బరిలో నిలువనుందని అంటున్నారు. పవన్ గత చిత్రాలు హిట్ కాకపోయినా పవన్ కున్న క్రేజ్ దృష్ట్యా తాజాగా తెరకెక్కే చిత్రాలపై భారీ అంచనాలుంటాయి. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే పవన్ ఎలా కనబడినా వాళ్ళకి కేకే.
అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కాటమరాయుడు కి ఎంత టెంక్షన్ పడ్డారో ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకి అంతే టెంక్షన్ పడుతున్నారని ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది. కాటమరాయుడు విషయంలో శృతి హాసన్ బాగా లావుగా కనబడి సినిమా ప్లాపయినప్పుడు బాగా విమర్శలు ఎదుర్కొంది. అసలు శృతి కొన్ని సీన్స్ లో బాగా లావుగా డీ గ్లామరస్ గా కనబడి సినిమా పోవడానికి సగం కారణమనే టాక్ అప్పట్లో బాగా వినబడింది.
ఇక ఇప్పుడు కీర్తి సురేష్ ని చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ మరలా అదే భయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కీర్తి ప్రస్తుతం పవన్ సినిమానే కాకుండా మహానటి సావిత్రిలో కూడా టైటిల్ రోల్ పోషిస్తుంది. అయితే సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి కాస్త వెయిట్ పెంచుకోవాలట. మరి ఆ పాత్రకి వెయిట్ ఓకేగాని పవన్ సినిమాలో ఎంత లావుగా కనబడుతుందో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే కొంతమంది మహానటి కీర్తి లుక్ కి, పవన్ సినిమాలో నటించే కీర్తి లుక్ కి అస్సలు సంబంధం ఉండదని కూడా అంటున్నారు. ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ లుక్ విషయంలో వేరియేషన్ చూపించడం అంత ఈజీ కాదనేవారూ లేకపోలేదు. మరి పవన్- త్రివిక్రమ్ మూవీలో కేరళ కుట్టి లుక్ ఎలా ఉంటుందనే విషయంలో క్లారిటీ వచ్చేంత వరకు పవర్ స్టార్ అభిమానుల్లో టెన్షన్ పోయేలా కనిపించడం లేదు.