ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ ( వేషాల పేరుతో లైంగిక సుఖాలు తీర్చుకోవడం)పై తీవ్ర చర్చ నడుస్తోంది. పలువురు హీరోయిన్లు తాము ఎన్నోసార్లు, ఎంతో మంది నుంచి లైంగిక వేదింపులు అనుభవించామని చెబుతున్నారు. ఇక రాంగోపాల్ వర్మది డిఫరెంట్ స్టైల్. ఆయన సృష్టిలో మీకు నచ్చింది ఏమిటి? అని అడిగితే 'వైన్ అండ్ ఉమన్' అని ఓపెన్‌గా చెబుతాడు. ఈ రెండింటిని సృష్టించిన ఆ దేవునికి వందనాలు అని ఎన్నోసార్లు చెప్పాడు.
ఇక ప్రస్తుతం ఆయన తనలోని హింస, సెక్స్‌లను చూపించడం కోసం ఏకంగా సెన్సార్ కఠినంగా ఉండే సినిమాలను వదిలి యూట్యూబ్‌లో వెబ్‌సిరీస్ పేరు మీద 'గన్స్ అండ్ థైన్స్' తీస్తున్నాడు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, నాకు సెక్స్ అంటే భలే భలే ఇష్టం. ఇక వోడ్కా అన్నా అంతే. కానీ అందరిలాగా నేను అమ్మాయిల సెక్స్ కోసం టైం వేస్ట్ చేయను. ఎవరినైనా సరే డైరెక్ట్‌గా 'నీది కావాలి... ఇస్తావా' అని ఫ్రాంక్‌గా అడిగేస్తాను అని చెప్పుకొచ్చాడు.
అసలు మాఫియా అనేదే ఆడాళ్లు, సుఖం కోసమని, కాబట్టి రెండింటిని విడదీసి చూడలేమని సందేశమిచ్చాడు. ఇక ముంబైలోని వర్మ ఆఫీస్‌కు ఆయన ముద్దుగా కంపెనీ అని పేరు పెట్టుకున్నాడు. లోపల ఇంటీరియల్స్ నుంచి క్రూర మృగాల బొమ్మలు, పుర్రెలను డెకరేట్ చేసి ఉంచుతాడట. ఇక దేవుడి గదిలాంటి విశాలమైన గది మద్యలో అద్భుతమైన పరుపులు, ఇతర సౌకర్యాలతో పెద్ద పడక మంచం ఉంటుంది.
ఇది దేనికి అని అడిగితే పచ్చిగా అమ్మాయిలను అనుభవించడానికి ఈ మాత్రం సౌకర్యం కూడా లేకపోతే ఎలా అంటున్నాడు. తన ఇష్టం వచ్చినట్లు తాను బతుకుతానని, తనకు ఒంటరితనం, నాకు నలుగురు కూడా తోడు లేరే.. అనిపించిన రోజే నేను ఆత్మహత్య చేసుకుంటానని వర్మ చెప్పడం విశేషం.