ఈ టీవీలో ప్రసారమవుతున్న మల్లెమాల వారి 'జబ్దరస్త్' అనే ప్రోగ్రాం బుల్లితెరపై వల్గారిటీని, డబుల్ మీనింగ్‌లను పెంచిపోషించింది. దీంతో అది వటవృక్షమై అన్ని చానెల్స్ అలాంటి కార్యక్రమాలనే అనుసరించే పద్దతి తయారైంది. దీనికి మూలకారణం మాత్రం మల్లెమాల యాజమాన్యమేనని చెప్పవచ్చు. ఇక ఇటీవల ఓ వేడుకలో చలపతిరావు మహిళలపై చేసిస వ్యాఖ్యానాల నేపథ్యంలో బుల్లితెరపై వస్తున్న బూతుపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది.
కొందరు కోర్టుల్లో కేసులు వేస్తే, మరికొందరు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. దీంతో ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్'తో పాటు ఈటీవీ ప్లస్‌లో వస్తున్న 'పటాస్' కార్యక్రమాలను కూడా ఏదో ఒక రోజున హఠాత్తుగా ఆపివేసే పరిస్థితి వచ్చింది. త్వరలోనే ఇది జరగడం ఖాయం. కాగా ఇటీవల 'జాక్‌పాట్' అనే కార్యక్రమంలో ప్రోమోలో షేకింగ్ శేషు 'మీది లేస్తే.. నాది పడుకుంటుంది' అనే డైలాగ్‌ను కట్ చేసి ప్రోమోగా వాడుకుంటున్నారు. దీనిపై 30 ఇయర్స్ పృథ్వీ నుంచి అందరూ అసహ్యించుకున్నారు. చివరకు దీనిపై అనసూయ కూడా వివరణ ఇవ్వాల్సివచ్చింది. ఇక తాజాగా షేకింగ్‌శేషు ఇలాంటి కార్యక్రమాల నిర్వాహకులపై మండిపడ్డాడు.
ఏదైనా స్క్రిప్ట్‌లో ఓ పంచ్ వేస్తాం. అందులో కాస్త బూతు ఉందని తెలిస్తే కార్యక్రమ నిర్వాహకులు వాటినే ప్రోమోలో ప్రమోట్ చేస్తూ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆర్టిస్టులను వెధవలను చేస్తున్నారు. నేను ఎంతో కాలంగా టీవీ ఆర్టిస్ట్‌గా ఉన్నాను. కానీ ఒకే ఒక్క ప్రోమోతో నా పరువు పోయింది. వాస్తవానికి ఆ కార్యక్రమం మొదటి రౌండ్‌లో నేను విజేతను. దాంతో రెండో రౌండ్‌లో టాస్క్ ఇవ్వాల్సి వచ్చింది. ఎలాగైన పక్కవారు గెలవకుండా చేయాలని ఆలోచించి, అలీ అనే ఆర్టిస్టుకు హిందు దేవాలయాల గురించి టాస్క్ ఇచ్చాను. దానికి అలీ 'బాబాయ్ నేను ముస్లింని.. నాకు హిందు దేవాలయాలు, దేవతల గురించి ఏమి తెలుసు' అన్నాడు.
నీకు అలాంటి టాస్క్ ఇస్తేనే 'నా రేటింగ్ లేస్తుంది.. నీ రేటింగ్ పడుతుంది' అన్నాను. ఇదేదో బూతులాగా ఉందే.. కాబట్టి దానిని ప్రోమోలో క్యాష్ చేసుకోవాలని కార్యక్రమ నిర్వాకులు భావించారు. వాస్తవానికి 'జబర్దస్త్'లో నేను రెండు సార్లు బూతు కంటెంట్‌తో ప్రోగ్రాం చేశాను. రెండింటిలో నేనే గెలిచాను. ఛీ.. బూతు వద్దు అనుకొని ఆ తర్వాత నార్మల్ స్కిట్స్ చేశాను. గెలవలేకపోయాను. వాస్తవానికి 'జబర్దస్త్' మొదటి ఎపిసోడ్స్‌లోనే బూతులు, వల్గారిటీ హీనంగా ఉన్నాయి. కానీ మాస్ ప్రేక్షకులు ఆహా ఓహో అన్నారు.
టీఆర్పీ 15,16 వచ్చింది. ఆ తర్వాత పలు ఒత్తిడుల వల్ల బూతు తగ్గించారు. టీఆర్పీ 5,6కి పడిపోయింది. ఈ రోజుల్లో నీతికి, మంచికి స్థానం లేదు. ఎవ్వరూ ఆదరించరు. మంచి కంటే చెడే ఎక్కువగా స్ప్రెడ్ అయి ఆదరణ పొందుతోంది. మల్లెమాల వంటి నిర్వాహకుల వల్ల ఆర్టిస్టుల పరువు గంగలో కలిసిపోతోంది.. అని ఆవేదన వ్యక్తం చేశాడు. షేకింగ్ శేషు మాటలు అక్షరసత్యాలు.