Advertisementt

అందులో ఛార్మిదే కీలక పాత్ర అంట..!

Sat 03rd Jun 2017 11:36 AM
director puri jagannadh,balakrishna,charmi,shriya,kyra dutt  అందులో ఛార్మిదే కీలక పాత్ర అంట..!
Puri and Balakrishna Combo Film Update అందులో ఛార్మిదే కీలక పాత్ర అంట..!
Advertisement
Ads by CJ

పూరి - బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లాంగ్ షెడ్యూల్ పోర్చుగల్ లో జరుపుకుంటుంది. ఇక అక్కడ హీరోయిన్ శ్రియ, బాలకృష్ణ లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పూరి. అయితే అక్కడ యూనిట్ సభ్యులతో పాటు హీరోయిన్ ఛార్మి కూడా షూటింగ్ స్పాట్ లో హడావిడి చేస్తూ అక్కడ జరిగే విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తూ బిజీగా వుంది.

పూరి జగన్నాధ్ తో కలిసి 'పూరి కనెక్ట్‌'లో భాగస్వామిగా ఉన్న ఛార్మి 'పూరి కనెక్ట్‌' వ్యవహారాలన్ని తానే చూసుకుంటోంది. అందుకే ఇప్పుడు పూరి డైరెక్ట్ చేసే బాలకృష్ణ చిత్రానికి సంబందించిన వ్యవహారాలను ఛార్మి చాక చక్యంగా నిర్వహిస్తుంది. హీరోయిన్స్ ఎంపికలో, ఐటెం గర్ల్ గా కైరా దత్ ను తీసుకోవడంలో ఛార్మి పాత్ర చాలా ఉందని అంటున్నారు. అయితే గతంలో ఛార్మి, బాలయ్య చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.... ఛార్మి ప్లేస్ లోకి ఇప్పుడు కైరా దత్ చేరిందని రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టైటిల్ లు బాలకృష్ణ బర్త్ డే కానుకగా 10 వ తారీఖు కంటే ఒక్కరోజు ముందు అంటే  ఈ నెల 9  న విడుదల చేస్తున్నట్లు టాక్ వినబడుతుంది 

Puri and Balakrishna Combo Film Update:

Puri-Balayya's film is going to be shot fast of shooting. But there is the heroine Charmi along with the unit members who are busy shooting at the spot and busy with social media from time to time. The first look and title of the movie which is not titled, will be heard as Balakrishna's birthday release on 10th of December

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ