Advertisementt

పవన్ తో ఆ డైరెక్టర్ నిజమేనా..?

Fri 02nd Jun 2017 06:19 PM
pawan kalyan,director trivikram,keerthy suresh,anu emmanuele,vv vinayak,and pawan combo  పవన్ తో ఆ డైరెక్టర్ నిజమేనా..?
Pawan Kalyan and VV Vinayak Combo Film Coming Soon! పవన్ తో ఆ డైరెక్టర్ నిజమేనా..?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కానీ దాసరి మరణంతో షూటింగ్ కి మూడు రోజులు బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా కనబడతాడని అంటున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు పవన్ కి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే పవన్, త్రివిక్రమ్ తో చేసే చిత్రం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి 2019  ఎన్నికలు సమాయత్తం అవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అందుకే పవన్ తన తదుపరి చిత్రాల నిర్మాతలతో కూడా మాట్లాడి ఒప్పించినట్లు వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు పవన్ మరో మాస్ డైరెక్షర్ తో సినిమా కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మాస్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న వివి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమాకి పవన్ కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా వీరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అయితే ఇప్పటికే వినాయక్, పవన్ ని కలిసి కథను చర్చించాడని....టాక్ వినబడుతుంది. మరి మాస్ చిత్రాలకు పెట్టింది పేరైన వినాయక్ డైరెక్షన్ లో పవన్ నటించడం అంటే అదో పెద్ద సెన్సేషనే. అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారని ఫిలింనగర్ టాక్.

Pawan Kalyan and VV Vinayak Combo Film Coming Soon!:

Pawan Kalyan is currently doing a movie in Trivikram direction. The shooting of this film is going on fast. Now, Pawan is reported to have committed a movie with another mass direction. Pawan Kalyan will be promoting a movie in the direction of VV Vinayak, who has done the image as a massive director.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ