బాలీవుడ్ చిత్రం ఒకటి బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించింది అంటే అది ఒకరికార్డు. కానీ ఒక తెలుగు మూవీ బాలీవుడ్ లో విడుదలై బాలీవుడ్ మూవీస్ పై పైచెయ్యి సాధించింది అంటే అది మామూలు విషయం కాదు. బాలీవుడ్ మూవీస్ కలెక్షన్స్ దుమ్ము దులిపి 'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం అరుదైన రికార్డు సృష్టించింది. అక్కడ బాహుబలి 500 కోట్ల కలెక్షన్స్ చాలా ఈజీగానే సాధించిందని చెప్పాలి. ఒక తెలుగు చిత్రం బాలీవుడ్ లో విజయకేతనం ఎగురవేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది అంటే అది ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగిన విషయమే.
ఎప్పుడూ ఖాన్స్ త్రయమే బాలీవుడ్ లో నెంబర్ 1 గా నిలిచేవారు. తమకు ఎదురులేదని విర్రవీగే ఆ త్రయానికి బాహుబలి రికార్డ్స్ తో గొంతులో పచ్చివెలక్కాయ ఎప్పుడో పడింది. ఇక ఇప్పుడు ఈ కళ్లుచెదిరే 500 కోట్ల కలెక్షన్స్ చూస్తే మాత్రం వారికీ డెఫనెట్ గా ఫీవర్ రావడం ఖాయమని అంటున్నారు. బాలీవుడ్ లో బాహుబలికి ముందు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం అమీర్ నటించిన 'దంగల్'. మరి ఇప్పుడు ఈ దంగల్ రికార్డ్స్ ని బాహుబలి క్రాస్ చేసి చరిత్ర సృష్టించింది. ఇంతకుముందే 1000 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టిన మొదటి ఇండియన్ సినిమాగా బాహుబలి చరిత్ర సృష్టించిన విషయం విదితమే.
అయితే బాహుబలి విడుదలై ప్రభంజనం సృష్టిస్తుంటే అమీర్ మెల్లగా 'దంగల్' ని చైనాలో విడుదల చేశాడు. ఇక చైనాలో బాహుబలి రికార్డులను దంగల్ తుడిచేసింది. అయినప్పటికీ బాహుబలి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదనేది ఇప్పుడు బాలీవుడ్ లో బాహుబలి సాధించిన 500 కోట్ల కలెక్షన్స్ చూస్తుంటే తెలుస్తుంది.