అల్లు అర్జున్ తాజా చిత్రం 'డిజె.. దువ్వాడ జగన్నాథం' జూన్ 23న విడుదలకు సిద్ధమవుతోంది. నెల రోజుల ముందు నుండే సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర యూనిట్ ఇప్పటికే పాటలతో మార్కెట్లో సందడి చేస్తుంది. తాజాగా విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో దుమ్మురేపే వ్యూస్ తో సంచలనం సృష్టిస్తున్న డిజె చిత్రానికి ఇప్పుడు బ్రాహ్మణ సంఘ్ల నుండి వ్యతిరేఖత ఏర్పడుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బ్రహ్మణుడిగా కనిపిస్తాడని ఫస్ట్ లుక్ లోనే రివీల్ చేశారు. అయితే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు రిలీజైన పాటలపై దుమ్మెత్తి పోస్తున్నాయి.
‘అస్మిక యోగ తస్మిక భోగ’ అనే పాటలో బూతు పదాలను ఉపయోగించారని ఆరోపిస్తూ బ్రాహ్మణ సంఘాలు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశాయి. బ్రాహ్మణులను హీనంగా చూపడం సినిమావాళ్లకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు రాసిన లిరిక్స్ ఏంటి? అందులోని పదాలేంటి? దాని అర్థం అసలు మీకు తెలుసా అంటూ నిర్మాతలపై ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఇలాంటి పాటలు రాయడం ఏమిటి అని వారి ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. అలాగే సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.
మరి బ్రాహ్మణ సంఘాల ఆరోపణలు డిజె యూనిట్ అసలు పట్టించుకుంటుందా? లేదంటే లైట్ తీసుకుని సినిమా ప్రమోషన్ కి బాగా పనికొస్తుందని పండగ చేసుకుంటుందో చూడాలి.