Advertisementt

రెండు సంఘటనలు... చితి కాలకుండానే..!

Fri 02nd Jun 2017 12:39 PM
allu arjun,allu arjun fans,dasari narayana rao,dasari big daughter in law  రెండు సంఘటనలు... చితి కాలకుండానే..!
The New Argument Has Been Raised in Doubts on dasari Death! రెండు సంఘటనలు... చితి కాలకుండానే..!
Advertisement

ఒకవైపు దాసరి నారాయణరావు మరణవార్తతో తెలుగు నాట విషాదం నెలకొన్న వేళ.. ఇంకా దాసరి అంత్యక్రియలు జరగకముందే చోటుచేసుకున్న రెండు సంఘటనలు అందరినీ విస్తుపోయేలా చేశాయి. దాసరి పెద్దకోడులు సుశీల ఆ శోకతప్తంలో అందరూ మునిగి ఉండగానే తనకు రావాల్సిన ఆస్థిలో వాటా కోసం నానా హంగామా చేసింది. అంతేకాదు.. ఏకంగా తన మామగారి మృతిపై తనకు అనుమానాలున్నాయనే కొత్త వాదనను లేవనెత్తింది. 

తనకు, తన భర్త ఇంకా విడాకులు ఇవ్వలేదని, తనకు ఆస్థిలో వాటా ఇస్తామని చెప్పిన మామగారు చనిపోయారని, ఇప్పుడు తన పరిస్థితి ఏమిటంటూ నానాయాగి చేసింది. ముందు జరగాల్సిన పని చూద్దాం.. తర్వాత మాట్లాడుకుందామని అక్కడి పెద్ద మనుషులు చెప్పినా వినలేదు. అంత ఆరోగ్యంగా ఉన్న తన మామ ఉన్నట్లుండి మరణించడం ఏమిటి? నాకు అనుమానాలున్నాయి? ఆస్థుల విషయంలో కుట్ర జరుగుతోంది. గతంలో మే 4వ తేదీన మామని కలిశాను. ఎందరికో న్యాయం చేసిన నేను నీకు అన్యాయం ఎందుకు చేస్తాను? ఓ చిన్న ఆపరేషన్‌ ఉంది. అది పూర్తికాగానే ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నీకు న్యాయం చేస్తాను అన్నాడని తెలిపింది. 

ఇక తన కుమారుడిని సినీ రంగ ప్రవేశం చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తాను. కాస్త ఓపిక పట్టు అన్నాడని , తన ఆస్థిలో వాటా సంగతి తేల్చమంది. ఇక దాసరి పార్ధివదేహాన్ని చూసేందుకు వచ్చిన బన్నీని ఆయన అభిమానులు సమయం, సందర్భం లేకుండా చుట్టుముట్టి 'డిజె, డిజె' అంటూ గోల గోల చేశారు. దానికి బన్నీ కూడా తన ఫ్యాన్స్‌పై కోపగించుకున్నారు. ఆ తర్వాత పోలీసులు వారిని చెదరగొట్టడంతో లోనికి వెళ్లిన బన్నీ దాసరిని చివరి చూపు చూశారు. సాధారణ ఫంక్షన్లలోనే పవన్‌ అభిమానులు ఏ ఫంక్షన్‌లో అయినా సరే పవన్‌ ..పవన్‌ అని అరవడం చూసి బన్నీ గతంలో కోపగించుకుని 'చెప్పను బ్రదర్‌' అన్నాడు. మరి అభిమానులు సమయం, సందర్భం వంటివి పట్టించుకోరని, తమ అభిమాన హీరో కనిపిస్తే ఇక రెచ్చిపోతారని ఇప్పుడు బన్నీకి సైతం స్వయంగా అనుభవమైందని అంటున్నారు. 

The New Argument Has Been Raised in Doubts on dasari Death!:

On the one hand Dasari Narayana Rao's death is a tragedy of the Telugu language and two events that have taken place before Dasari's funeral. When Dasari's big Daughter in law were all in the mood of Sushila, Nana Hungama made for her share of the property to come.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement