Advertisementt

శృతి హాసన్ కి గట్టి కౌంటరే పడింది..!

Fri 02nd Jun 2017 12:12 PM
sangamithra movie,shruti haasan,director sunder c,anushka,tamanna,sangamithra team  శృతి హాసన్ కి గట్టి కౌంటరే పడింది..!
Why Shruti Hasan Gave Up Sanghamitra?! శృతి హాసన్ కి గట్టి కౌంటరే పడింది..!
Advertisement
Ads by CJ

శృతి హాసన్ 'సంఘమిత్ర' ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకుందో అనేది క్లారిటీ ఇచ్చేసింది. అసలు సినిమాలో నటించడం అనేది ఎవరిష్టాన్ని బట్టి వాళ్లకు ఉంటుంది. అయితే ఇక్కడ 'సంఘమిత్ర' నుండి తప్పుకున్న శృతి హాసన్ మాత్రం ఆ సినిమా టీమ్ పై బురద జల్లే ప్రయత్నం చేసింది. 'సంఘమిత్ర' కోసం తాను చాలా కష్టపడ్డానని... దానికోసమే తాను విదేశాలకు వెళ్ళి కత్తి యుద్ధాల్లో ప్రావీణ్యం సంపాదించానని..కానీ 'సంఘమిత్ర' టీమ్ వాళ్ళు తనకు సరిగ్గా స్క్రిప్ట్ చెప్పకుండా ఇబ్బంది పెట్టారని... అసలిప్పటి వరకు కథ సిద్ధం కాకపోవడం వలెనే తాను ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు  ప్రకటించింది.

అయితే మరోవైపు మాత్రం శృతి బాధ పడలేక 'సంఘమిత్ర' యూనిట్  శృతి ని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ శృతి మాత్రం తనకి ఇష్టం లేక... ఇంకా 'సంఘమిత్ర' చిత్ర యూనిట్ కి అసలు కమిట్మెంట్ లేకపోవడం వలెనే తాను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన జారీ చేసింది. శృతి ఆరోపణలపై 'సంఘమిత్ర' టీమ్‌ ఘాటుగా స్పందించింది. అంతా ఓకే అనుకున్నాకే, శృతి హాసన్‌ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందనీ, ఇప్పుడు కథ సరిగ్గా లేదనడం హాస్యాస్పదమని చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. 

మరి సుందర్ సి డైరెక్షన్ లో 250  కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'సంఘమిత్ర' చిత్రంలో ఇప్పుడు శృతి హాసన్ తప్పుకోవడంతో... మరో హీరోయిన్ ని ఎవరిని తీసుకుంటారనే దానిమీద ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతుంది. అనుష్క, తమన్న ల పేర్లు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో సంఘమిత్ర టీమ్ ఎవరని ఫైనల్ చేస్తుందనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సివుంది.

Why Shruti Hasan Gave Up Sanghamitra?!:

As days progressed with this rigorous and physically pummeling pedagogic teaching part, Shruti understood a bit late that doing glamorous roles with simple songs running around the hero is easier than believing in grand and time taking projects like Sanghamitra. All is well. Shruti informed the producers directly on her helplessness and gave a middle drop. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ