Advertisementt

అఖిల్ కి తల్లిగానా.. హీరోయిన్ కి తల్లిగానా..?

Thu 01st Jun 2017 05:25 PM
akhil,nagarjuna,director vikram kumar,tabu  అఖిల్ కి తల్లిగానా.. హీరోయిన్ కి తల్లిగానా..?
Tabu to Play Akhil's Mom! అఖిల్ కి తల్లిగానా.. హీరోయిన్ కి తల్లిగానా..?
Advertisement
Ads by CJ

అఖిల్ తన రెండో చిత్రాన్ని విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలైనప్పటి నుండి జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హీరోయిన్ కోసం రెండవ షెడ్యూల్ ని వాయిదా వేసింది చిత్ర యూనిట్. అఖిల్ కి జంటగా నటించే హీరోయిన్ ని ఫైనల్ చెయ్యడంలో నాగార్జున, విక్రమ్ లు చాలా టైమ్ తీసుకున్నారు. మొదట్లో బాలీవుడ్ భామ అలియా భట్ ని అఖిల్ కి హీరోయిన్ గా సలెక్ట్ చేసినట్లు వార్తలొచ్చినప్పటికీ చివరకి మేఘ ఆకాష్ నే అఖిల్ కి జోడిగా ఎంపిక చేశారని సమాచారం.

నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పుడు ఒక బాలీవుడ్ నటి కూడా నటిస్తుందని అంటున్నారు. నాగార్జున కి క్లోజ్ ఫ్రెండ్ అయిన టబు అఖిల్ చిత్రంలో ఒక కీలక పాత్ర లో కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో టబు తల్లి పాత్రలో కనిపిస్తుందట. అయితే అఖిల్ కి తల్లిగానా... లేకపోతే హీరోయిన్ తల్లిగానా అనేది క్లారిటీ లేదుగాని టబు పాత్ర మాత్రం కీలకం అంటున్నారు. అయితే ఇప్పటి వరకు పెద్దగా తల్లి పాత్రలు చెయ్యని టబు కేవలం అక్కినేని వారితో ఉన్న తత్సంబందాల వలెనే ఈ ఆఫర్ కి ఓకె చెప్పిందని అంటున్నారు. 

అయితే టబు ఇది వరకే 'చెన్నకేశవ రెడ్డి' లో సీనియర్ బాలకృష్ణ కి భార్యగా... ఒక బాలకృష్ణ కి తల్లిగా నటించి మెప్పించింది. మరి ఇప్పుడు కూడా అఖిల్ - విక్రమ్ చిత్రంలో తల్లిగా టబు ఎలాంటి నటనను ప్రదర్శిస్తుందో తెలియాలంటే  సినిమా విడుదల వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Tabu to Play Akhil's Mom!:

King Nagarjuna and Tabu's combo was said to be one of the best combos of Tollywood. The combo's 'Ninne Pelladutha's rocking victory at the box office acknowledged the fact. It was also rumoured that Tabu was one of the favourite heroines of Nagarjuna then.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ