పూరి డైరెక్షన్ లో బాలకృష్ణ - శ్రీయ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ పోర్చుగల్ లో శరవేగంగా జరుపుకుంటుంది. బాలకృష్ణ పై యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. బాలకృష్ణ చిత్రంలో హీరోయిన్ ఛార్మి ఒక ఐటెం సాంగ్ చేస్తుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న న్యూస్. ఇక పూరికి కూడా ఛార్మి క్లోజ్ గనక ఈ ఛాన్స్ ని ఛార్మి కొట్టేసిందనే టాక్ కూడా బాగానే ప్రచారం అయ్యింది.
అయితే ఇప్పుడు ఛార్మి కంటే కొత్త బ్యూటీ అయితే ఐటెం సాంగ్ కి బాగుంటుందని బాలకృష్ణ సలహా ఇవ్వడంతో పూరి కూడా సరే అన్నాడని టాక్. అందుకే ఛార్మి ప్లేస్ లోకి కొత్త బ్యూటీ వచ్చి చేరిందని అంటున్నారు. ఛార్మి ప్లేస్ లోకి కైరాదత్ అనే కొత్త బ్యూటీ ఎంట్రీ ఇవ్వనుందట. కైరా దత్ ఎవరో కాదు... బాలీవుడ్ డైరెక్టర్ మధూర్ బండార్కర్ తెరకెక్కించిన ‘క్యాలెండర్ గర్ల్స్’ ఫిల్మ్‌లో ప్రధాన పాత్రలో నటించింది. ఇక బాలయ్య అలా సలహా ఇచ్చాడో లేదో పూరి ఇలా తన టీమ్ తో కైరా ని అప్రోచ్ అవ్వడం జరిగిపోయానని అంటున్నారు.
40 రోజులపాటు కీలక సన్నివేశాలు, పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్న పూరి.... ఎప్పుడూ తన సినిమాలకు స్పెయిన్‌ని ఎంపిక చేసుకునేవాడు. కానీ ఈ సారి మాత్రం పోర్చుగల్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఇకపోతే ఛార్మిని తప్పించి కొత్త బ్యుటిని ఎంపిక చేయడంపై ఛార్మి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.