బొద్దుగుమ్మగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నిత్యా మీనన్ అందంతో, అభినయంతో, నటనతో హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. అయితే ఈ మధ్యన నిత్య నటించిన సినిమాలేవీ లేవు. అసలు నిత్య మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తుందనే న్యూస్ తెగ ప్రచారం జరిగింది. చివరికి మణిరత్నం ఆఫర్ ని కూడా వదులుకుందని ..ఇకపై హీరోయిన్ గా చేయదనే న్యూస్ హల్చల్ చేసింది. అంత టాలెంట్ వున్న నిత్య మీనన్ ఉన్నట్టుండి ఎందుకిలా చేస్తుందో అర్ధంకాక నిర్మాతలతో పాటు ఆమె అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
అయితే నిత్య మీనన్ హీరోయిన్ పాత్రలను రిజక్ట్ చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టబోతున్నందువల్లే ఇలా హీరోయిన్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తుందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే తాజాగా నిత్యమీద వస్తున్న వార్తలకు నిత్య ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తాను డైరెక్టర్ గా మారుతున్నానంటూ వచ్చిన న్యూస్ నిజం కాదని తేల్చేసింది. డైరెక్షన్ చేయడం అంత ఈజీ కాదని .. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం యాక్టింగ్ మీదే వుందని చెప్పింది. సినిమాల విషయం లో ముందు నుండీ కొంచెం సెలెక్టివ్ గానే చేసాననీ.. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేక పోయానీ..తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేస్తాననీ క్లారిటీ ఇచ్చింది.