ఇజం ఇచ్చిన షాక్ తో లాంగ్ గ్యాప్ తీసుకుని మళ్లీ హీరోగా సినిమా మొదలు పెట్టబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఒకేసారి రెండు చిత్రాలను పట్టాలెక్కించనున్న కళ్యాణ్ రామ్ ముందుగా ఉపేంద్ర మాదవన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ ఈ మధ్యనే పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఉపేంద్ర మాదవన్ కి శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి వంటి వారి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవం వుంది.
ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడి దొరికేసింది అంటున్నారు. ప్రస్తుతం ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ లో ఒన్ ఆఫ్ ద హీరోయిన్ గా చేస్తున్న మనాలి రాధోడ్ ని కళ్యాణ్ హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చితక కేరెక్టర్స్ చేస్తూ కాలం గడుపుతున్న మనాలి రాధోడ్ కి ఇప్పుడు కళ్యాణ్ పక్కన పూర్తిస్థాయి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రానికి భరత్ చౌదరి, విశ్వ ప్రసాద్ లు నిర్మాతలు.