Advertisementt

శృతి హాసన్ క్లారిటీ ఇచ్చేసింది..!

Tue 30th May 2017 07:33 PM
shruti haasan,kollywood industry,sangamithra movie  శృతి హాసన్ క్లారిటీ ఇచ్చేసింది..!
Shruti Haasan Gave The Clarity శృతి హాసన్ క్లారిటీ ఇచ్చేసింది..!
Advertisement

తమిళనాట అతిపెద్ద ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం 'సంఘమిత్ర'. ఈ చిత్రంలో లీడ్ కేరెక్టర్ లో శృతి హాసన్ నటిస్తుండగా జయం రవి, ఆర్యలు హీరోలుగా నటిస్తున్నారు. 250  కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం శృతి హాసన్ చాలా విద్యలు నేర్చుకుంది. సంఘమిత్ర చిత్రం ఓపెనింగ్ కూడా కేన్స్ ఫిలింఫెస్టివల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి శృతి హాసన్ తప్పుకుంది. ఉన్నట్టుండి ఇంత భారీ ప్రాజెక్ట్ నుండి శృతి తప్పుకోవడానికి గల కారణాలు కూడా చెప్పేస్తుంది భామ.

సంఘమిత్ర ప్రాజెక్ట్ కోసం అందరికన్నా ఎక్కువగా కష్టపడ్డానని... ఏప్రిల్ నెల అంతా లండన్ వెళ్లి అక్కడ  యుద్ధ విన్యాసాలతో ట్రైనింగ్ పొందానని సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ కమిట్ మెంట్ చూపించానని.. కానీ ఆ కమిట్ మెంట్ యూనిట్ వద్ద లేదని ఆరోపిస్తుంది. అతిపెద్ద ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంఘమిత్ర కోసం రెండేళ్లు కాల్షీట్స్ ఇచ్చానని... రెండేళ్ల పాటు షూట్ చేయాల్సిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు బౌండెడ్ స్క్రిప్ట్ తయారుచేయలేదని అంటుంది. అలాగే తన డేట్స్ ఎన్ని కావాలో కూడా తనకు మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదని ధ్వజమెత్తింది.

కేవలం యూనిట్ నుండి సరైన రెస్పాన్స్ రాకపోవడంతోనే తాను సంఘమిత్ర ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు చెబుతుంది. ఒక స్టార్ హీరోయిన్ అయివుండి కేవలం డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోవడం వలన, స్క్రిప్ట్ గురించి తనతో చర్చించక పోవడం వలెనే శృతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమనేది సరైన రీజన్ లా అనిపించడం లేదు. చాలా సిల్లీ రీజన్ లా కనిపిస్తుంది. మరి శృతి చేసిన కామెంట్స్ కి సంఘమిత్ర యూనిట్ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది చూడాలి.

Shruti Haasan Gave The Clarity:

Shruti Haasan dropped out of this project. The reasons behind this are the reasons for the shredding of such a huge project.  As of now, the Bounded script does not make any reference to this movie. The makers are not giving her clarity on how many of her dates will be. The reason why he did not get the correct answer from the unit is that he has left the Sangimitra project.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement