డిజె చిత్రం సందడి మార్కెట్ లో షురూ అయ్యిది. డిజె పాటలు ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి విడుదల చేస్తూ హంగామా చేస్తుంది డిజె చిత్ర యూనిట్. అల్లు అర్జున్ - పూజ హెగ్డే జంటగా నటిస్తున్న 'డిజె.. దువ్వాడ జగన్నాథం' చిత్రం దేవిశ్రీ మ్యూజిక్ తో తెరకెక్కిన పాటలతో దుమ్ముదులపడానికి రెడీ అయ్యారు. అల్లు అర్జున్ గత చిత్రం 'సరైనోడు' చిత్రం వాలే పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసి 'డిజె' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ టీమ్.
ఇప్పటికే 'శరణం భజే భజే...' సాంగ్ తో యువతను ఉర్రుతలూగిస్తున్న 'డిజె' ఇప్పుడు మరో సాంగ్ తో అదరగొట్టేస్తుంది. అల్లు అర్జున్ - పూజ హెగ్డే కలిసి డాన్స్ చేసే 'గుడిలో... బడిలో మదిలో... ఒడిలో' అనే సాంగ్ ను వీడియోతో సహా రిలీజ్ చేశారు. కొంచెం స్లో గా స్టార్ట్ అయ్యే ఈ సాంగ్ లో అల్లు అర్జున్ డాన్క్స్ స్టెప్స్ హైలెట్ గా వున్నాయి. ఇక అల్లు అర్జున్ తో కలిసి పూజ హెగ్డే కూడా డాన్స్ ఇరగదీసేసింది. ఈ డ్యూయెట్ లో అల్లు అర్జున్, పూజ డాన్స్ అదరహో అని చెప్పాలి. మరి దేవిశ్రీ మ్యూజిక్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.
ఇప్పటికే బ్రాహ్మణ గెటప్ లో అదరగొడుతున్న అల్లు అర్జున్ లుక్.... ఇప్పుడు రొమాంటిక్ వెర్షన్ లో కూడా దంచేస్తున్నాడు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన రెండు పాటలే పిచ్చెక్కిస్తుంటే మున్ముందు విడుదలయ్యే పాటలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూద్దాం.