నిన్నటి వరకు పెద్ద పెద్ద చిత్రాలు, స్టార్స్ చిత్రాలకు మాత్రమే ముందు రోజు నుంచి ప్రీమియర్ షోలు ఉండేది. కాగా జూన్ 2న రాజ్ తరుణ్ నటించిన 'అంధగాడు' విడుదల కానుంది. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రాజ్ తరుణ్‌తో హ్యాట్రిక్ చిత్రాలు తీసిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో గోల్డెన్ బ్యూటీ హెబ్బా పటేల్ నటిస్తోంది. ఇక ఆ తర్వాత జూన్ 7న నాని 'నిన్నుకోరి', జూన్ 9న గోపీచంద్-నయనతార-బి.గోపాల్‌ల 'ఆరడుగుల బుల్లెట్' విడుదల కానున్నయి.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ, దానయ్య, తాండ్ర రమేష్‌లు భారీ నిర్మాతలు కావడంతో ఈ మూడు చిత్రాలపై కూడా పబ్లిసిటీపరంగా, ప్రమోషన్స్‌పరంగా, ఆడియో వంటివి కూడా కలిసి వస్తే వాటికి మంచి ఊపువస్తుంది. దీంతో ఈ ముగ్గురు నిర్మాతలతో పాటు రాజ్ తరుణ్, నాని, గోపీచంద్‌లు వరుసగా తమ చిత్రాలకు కూడా ముందు రోజు నుంచే ప్రీమియర్ షోలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంధుడు చుట్టూ తిరిగే కామెడీ లవ్ సెంటిమెంట్ చిత్రంగా 'అంధగాడు', ప్రణయ నేపథ్యంలో, లవ్ విత్ మాస్ అట్రాక్షన్స్‌లో నాని 'నిన్నుకోరి', మాస్ మసాలా యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో 'ఆరడుగుల బుల్లెట్' వస్తున్నాయి.
ఇక నేటితరం హీరోలలో కూడా రామ్ మినహా ఎవ్వరికీ బి.గోపాల్ వంటి దర్శకునితో చిత్రం చేసే అవకాశం రాలేదు. హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేయాలో వినాయక్, బోయపాటిల కంటే ముందే తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడాయన. ఈవిషయంలో గోపీచంద్ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఇప్పటికే మాస్ అండ్ యాక్షన్ హీరోగా ఉన్న గోపీచంద్ రేంజ్‌ను బి.గోపాల్ డబుల్, ట్రిపుల్ చేసినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ప్రీమియర్ షోల ద్వారా వచ్చే హిట్, అండ్ పాజిటివ్ టాక్‌ని నేడు అందరూ హీరోలు అందుకోవాలని చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుందాం..!