Advertisementt

ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తేగాని...!

Tue 30th May 2017 12:13 PM
jai lava kusa movie,director bobby,producer kalyan ram,hero jr ntr  ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తేగాని...!
Rumors on Jai Lava Kusa Movie! ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తేగాని...!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడో? రాడో? క్లారిటీ లేదుగాని... ఈ విషయమై రోజు రోజుకి సోషల్ మీడియాలో మాత్రం రోజుకో న్యూస్ ప్రచారంలోకి వచ్చేస్తుంది. ఎన్టీఆర్ 2019  ఎన్నికల నాటికి పార్టీ పెట్టబోతున్నాడని.... కాదు కాదు ఎన్నికల్లో వేరెవరికో సపోర్ట్ చేస్తాడని... ఇలా రకరకాల న్యూస్ లు తెగ హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ నెక్స్ట్ చిత్రాలు కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నాయనే ప్రచారమూ మొదలైంది. ఇక ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం తర్వాత త్రివిక్రంతో చెయ్యబోయే చిత్రం మొత్తం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే వుంటుందనే ప్రచారం జరుగుతుండగానే... ఇప్పుడు 'జై లవ కుశ' చిత్రం గురించి మరొక విచిత్రమైన న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

అదేమిటంటే 'జై లవ కుశ కథ' కూడా పాలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని... ఎన్టీఆర్ చేస్తున్న జై కేరెక్టర్ నెగెటివ్ షేడ్స్ తోపాటు పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని.... జై పాత్రకి కొంచెం నత్తి ఉంటుందని.... ఆ నత్తి కారణంగానే చిన్న వయసులో చాలా అవమానాలకు గురైన జై అపరిమితమైన తెలివితేలతో పక్కనున్న వాళ్లకు చుక్కలు చూపిస్తూ ఒక పొలిటీషన్ దగ్గర ఆశ్రయం పొందుతాడట. ఆ పొలిటీషన్ కి  జై తన తెలివితేటలతో రాజకీయ ఎత్తుల గురించి నేర్పించి సమయం రాగానే ఆ పొలిటిషన్ ని పక్కన పెట్టి తానే ఒక లీడర్ అవతారమెత్తుతాడని.... ఇక  పొలిటిషన్ గా జై చేస్తున్న అరాచకాలకు లవ, కుశ లు ఇద్దరూ చెక్ పెట్టడతారని... చివరకు ఊహించని పరిణామం జరుగుతుందని...ఇదే 'జై లవ కుశ' స్టోరీ అంటూ రూమర్ స్ప్రెడ్ అయ్యింది. 

మరి నిజంగా 'జై లవ కుశ' కథ ఇదే గనక అయితే చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అయితే  'జై లవ కుశ'లో పొలిటికల్ స్పీచెస్ వుంటాయని... అవి చంద్రబాబు కి యాంటీగా మాత్రం ఉండవనే ప్రచారము జరుగుతుంది. అయితే ఇలా వస్తున్న ఎన్టీఆర్ పొలిటికల్ వార్తలకు ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తేగాని వాటికి ఫుల్ స్టాప్ పడేలా లేదు. జై లవ కుశ ని బాబీ డైరెక్ట్ చేస్తుండగా కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా రాశి ఖన్నా, నివేత థామస్, నందిత లు నటిస్తున్నారు.

Rumors on Jai Lava Kusa Movie!:

Junior NTR enters politics no? There is no clarity ... it's a day in social media that comes to day news coverage. 'Jai Lava Kutta Katha' is also going to be a political backdrop ... Jai character doing NTR will be inactive along with negative shades along with the polytics.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ