Advertisementt

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్..!

Mon 29th May 2017 03:59 PM
allu arjun,pooja hegde,harish shankar,dj movie,second song release at 6pm on 29th may 2017  అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్..!
DJ-Duvvada Jagannadham Movie Second Song Release on 29th May 2017 at 6pm అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'డీజె... దువ్వాడ జగన్నాధం' చిత్రం వచ్చేనెల అంటే జూన్ 23 న విడుడల తేదీ ప్రకటించారు. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ 'డీజె' హడావిడి బాగా ఎక్కువైపోతోంది. 'డీజె' కి సంబందించిన పబ్లిసిటీ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇక ఆ పబ్లిసిటీలో భాగంగా డీజె పాటలను ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి డైరెక్ట్ గా రిలీజ్ చేస్తూ హడావిడి మొదలు పెట్టేశారు. డీజె ఫస్ట్ సింగల్ 'శరణం భజే భజే' మార్కెట్ లో హల్చల్ చేస్తుండగానే ఇప్పుడు మరో సర్ప్రైజ్ కి డీజె రెడీ అయ్యింది.

'శరణం భజే భజే' సాంగ్ యూట్యూబ్ ని షెకాడిస్తుంటే ఇప్పుడు మరో డీజే సాంగ్ 'గుడిలో... బడిలో మడిలో...' అంటూ ఉర్రుతలూగిన్చడానికి ఈ రోజు సాయంత్రం 6  గంటలకి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కాసుకోండి ఈ రోజు సాయంత్రం 6  గంటలకు డీజె సర్ప్రైజ్ అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఇలా పాటలను నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేసి 'డీజె' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం భారీ లెవల్లో చెయ్యడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. 

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అర్జున్ పవర్ ఫుల్ బ్రాహ్మణుడి పాత్రలో ఈ చిత్రంలో మొదటిసారిగా నటిస్తున్నాడు. 

DJ-Duvvada Jagannadham Movie Second Song Release on 29th May 2017 at 6pm:

Allu Arjun's heroine Harish Shankar is directing the film 'Dj- Duvvada Jagannadham', which will be released on June 23rd. Allu Arjun himself posted on his Twitter. DJ Surprise has been posted at 6 pm this evening.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ