బాహుబలిలో శివగామి పాత్ర కోసం శ్రీదేవిని రాజమౌళి అండ్ టీమ్ సంప్రదించగా ఆమె చెప్పిన రెమ్యునరేషన్ కి కళ్ళు బైర్లుగమ్మి రమ్యకృష్ణ ని శివగామి పాత్రకి తీసుకుందని ఓప్రచారం 'బాహుబలి ద బిగినింగ్' అప్పటి నుండి వుంది. అయితే శ్రీదేవిని అడిగిన విషయాన్ని మాత్రం రాజమౌళి ఎక్కడా బయటపెట్టలేదు. అయితే రీసెంట్ గా ఆయన ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీదేవి విషయం బయటపెట్టాడు. బాహుబలికి హిందీలో మార్కెట్ పెంచాలి అంటే శివగామి కేరెక్టర్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావించి శ్రీదేవి అయితే బాహుబలికి ప్రచారం లేకుండా పబ్లిసిటీ జరుగుతుందని అనుకుని ఆమెని సంప్రదించారట.
అయితే శివగామి పాత్రకి శ్రీదేవి ఏకంగా ఎనిమిదికోట్లు రెమ్యునరేషన్ అడిగి...... ప్రతిసారి షూటింగ్ కి వచ్చినప్పుడల్లా 5 బిజినెస్ క్లాస్ టిక్కెట్లు, బిగ్గెస్ట్ హోటల్‌లో 5 సూట్లు అడిగిందట. అయినా పర్వాలేదనుకుని ఆమెతో డీల్ సెట్ చెయ్యడానికి రెడీ అవ్వగా బాహుబలి హిందీ వెర్షన్ కి పర్సంటేజ్ అడగడంతో టూమచ్ అనుకున్న రాజమౌళి అండ్ టీమ్ చివరికి ఆమె స్థానంలోకి రమ్యకృష్ణ ని తీసుకున్నారట. ఇక శివగామిగా రమ్యకృష్ణ ఎంతలా మెప్పించిందో బాహుబలి చూసిన వారికి చెప్పక్కర్లేదుగా... అందుకే శ్రీదేవి అలా అడగడం తమ అదృష్టం అంటూ రాజమౌళి నవ్వేస్తున్నాడు.