మహేష్ బాబు 'బ్రహోత్సవం' డిజాస్టర్ తర్వాత మురుగదాస్ డైరెక్షన్ లో స్పై థ్రిల్లర్ మూవీ 'స్పైడర్' లో నటిస్తున్నాడు. ఈ చిత్రం బైలింగువల్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మొదటిసారి రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ తో జోడీకడుతుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు టైటిల్ విషయంలో, ఫస్ట్ లుక్ విషయంలో మురుగదాస్ తీవ్ర జాప్యం చేశాడు. దీనితో మహేష్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. అలాగే సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విషయంలోనూ అదే జాప్యం జరిగింది. ఇదిగో అదిగో అంటూ అంటున్నారే గాని టీజర్ రిలీజ్ ఊసెత్తడంలేదు. ఇక మహేష్ బాబు కూడా ఈ విషయంలోనే కాకుండా సినిమా షూటింగ్ విషయంలోనూ మురుగదాస్ పై కోపంగా ఉన్నాడనే ప్రచారం మొదలైంది.
'స్పైడర్' షూటింగ్ కూడా ఈ నెలాఖరులోగా కంప్లీట్ కావాల్సి ఉండగా మురుగదాస్ కొన్ని సీన్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రీ షూట్ చేయడం వలన షూటింగ్ ఆలస్యమైందని... ఈ కారణంగానే మహేష్ డేట్స్ అయిపోయినా కూడా ఈ సినిమాకోసం మరికొన్ని డేట్స్ కేటాయించాడని అంటున్నారు. ఇవన్నీ అలా ఉండగా ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా 'స్పైడర్' చిత్రం దసరాకి విడుదలవుతుందని అప్పటిలోగా అంటే మే 31 సాయంత్రం 5 గంటలకు 'స్పైడర్' చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించాడు. ఇక మహేష్ అలా చెప్పాడో లేదో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో తమ అభిమాన నటుడి నటన ఎలా వుండబోతుందో చూడడానికి రెడీ అవుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.