'బ్రహ్మూెత్సవం' వచ్చింది..వెళ్లింది... దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. కానీ ఈ చిత్రం తర్వాత మరలా పూర్వవైభవం సాధించి, తన అభిమానులకు ఆనందం కలిగించాలనే ఉద్దేశ్యంతో మహేష్ ఏకంగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో 'స్పైడర్' చిత్రం ప్రారంభించాడు. ఈ చిత్రం ద్వారా మహేష్ కోలీవుడ్‌కి స్ట్రెయిట్‌గా అడుగుపెడుతుండటం, దక్షిణాదిలో ఏస్ డైరెక్టర్‌గా పేరున్న మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండటంతో పాటు ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఠాగూర్ మదు, ఎన్వీప్రసాద్‌లు నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.
రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి హరీస్ జైరాజ్ సంగీతం అందిస్తుండగా, తెలుగు, తమిళ భాషల్లో కీలక పాత్రల్లో వేర్వేరు నటీనటులు నటిస్తున్నారు. ఇక విలన్లుగా ఎస్.జె.సూర్య, 'ప్రేమిస్తా' ఫేమ్ భరత్‌లు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై ఏడాది దాటిపోయింది. నాటి నుంచి మహేష్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. జనవరి 1న ఫస్ట్‌లుక్, పండగకు సినిమా విడుదల అన్నారు. ఆ తర్వాత ఎన్నో పండుగలు వచ్చాయి.. వెళ్లాయి. కానీ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను టైటిల్ 'స్పైడర్' అనే దానిని కన్‌ఫర్మ్ చేసి రిలీజ్ చేశారు.
ఆ తర్వాత షరామామూలే. ఎటువంటి అఫీషియల్ అప్‌డేట్స్ లేవు. ఆ తర్వాత జూన్ 23న విడుదల అన్నారు. అది కూడా వాయిదా పడింది. ఇక మహేష్‌కు తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న తన చిత్రం తాలుకా ఏదైనా టీజర్‌ను, పాటలను విడుదల చేయడం సెంటిమెంట్. ఇది చాలా కాలంగా వస్తోంది. ఈ ఏడాది కూడా అలాంటిది ఏమైనా ఉంటుందేమోనన్న ఆసక్తిలో అభిమానులున్నారు. కానీ ఈ సారి మహేష్ తన తండ్రి పుట్టిన రోజు సెంటిమెంట్‌ను పాటించలేకపోతున్నాడని సమాచారం. ఈ చిత్రం టీజర్‌ను ఇప్పుడే రిలీజ్ చేయడం కష్టమని, తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉండటంతో హడావుడిగా టీజర్ కట్ చేయడం వీలుకాదని మురుగదాస్ మహేష్‌కి చెప్పేశాడట.
దాంతో మహేష్ తల పట్టుకుంటున్నాడు. ఈ చిత్రం ఆడియోను కాకపోయినా కనీసం తన తండ్రి పుట్టినరోజు కానుకగా టీజర్‌నైనా విడుదల చేయకపోవడంపై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు. కేవలం 30 సెకన్ల నిడివి గల టీజర్‌ను కట్ చేసేంత కంటెంట్ కూడా లేదా? అని వారు మురుగదాస్‌పై ఫైర్ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈనెల 31న కృష్ణ బర్త్‌డే కానుకగా మరో మోషన్ పోస్టర్‌తో కూడిన లుక్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట.