జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అనేక సంచలన విషయాలు జరిగాయి. అయితే అనిశ్చితిలో ఉన్న తమిళ రాజకీయాలను క్యాష్ చేసుకోవడానికి చాలామందే సీన్ లోకి ఎంటరయ్యాడు. ఆఖరికి రాజకీయాలు తనకు సరిపడవన్న కమల్ హాసన్ కూడా తమిళ రాజకీయాలు గురించి మాట్లాడటం మొదలు పెట్టేసాడు. ఇక ఎప్పటినుండో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుతాడని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు రజినీకాంత్ 'దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని' ప్రకటించాడు.
అందుకే ఎనిమిదేళ్లుగా అభిమానులని మీట్ కానీ రజిని ఉన్నట్టుండి అభిమానులతో భేటీ అంటూ హడావిడి చేసేసాడు. అయితే రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి వ్యతిరేఖంగా తమిళ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన గళాలు విప్పాయి. కమల్ హాసన్, డైరెక్టర్ భారతి రాజా వంటివారు డైరెక్టుగానే రజిని రాజకీయాల్లోకి వస్తే కుదరదని చెప్పేసారు. బయట ఇంత జరుగుతున్నా రజినీకాంత్ మాత్రం మౌనంగానే వున్నాడు. అయితే సడన్ గా రజిని అన్నగారు సత్యనారాయణ రావు గైక్వాడ్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం పెట్టేసారు.
రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరం అంటూ... వచ్చే జులై లో రజిని సొంతంగా పార్టీ పెట్టబోతున్నాడు అంటూ ప్రకటన విడుదల చేసేసాడు. పార్టీకి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పాడు. అయితే రజినీకాంత్ ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. తాజాగా ఆయన 'కాలా' చిత్ర షూటింగ్ కోసం ముంబై కి వెళ్లగా అక్కడ మీడియావారు... మీరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారట.... అది ఎప్పుడు అని అడగగా దానికి రజిని నేను రాజకీయాల్లోకి వస్తే స్వయంగా చెబుతాను అంటూ ముభావంగా సంధానం దాట వేశాడు.