స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. వాజ్‌పేయ్‌తో పాటు బాబు చక్రం తిప్పిన తృతీయఫ్రంట్ హయాంలో గానీ, బిజెపితో పొత్తు పెట్టుకున్న నేడు గానీ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని బాబు అండ్‌కో.... నందమూరి వారసులు అంటున్నా కూడా ఇది జరిగేపని కాదని అంటున్నారు. చంద్రబాబు, బాలకృష్ణలతో పాటు ఎవ్వరూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్‌కు భారతరత్న విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారు.
కానీ ఆయన ఫొటో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. దీనికి పలు రాజకీయ, సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు. కానీ భారతరత్న అనేది రాష్ట్రపతి సిఫార్సు చేయాలని, కాబట్టి ఈ లెటర్‌ను పీఎంవోకి పంపించారు. కానీ దీనిపై తాజాగా కొందరు కొత్త లాజిక్ చెబుతున్నారు. ఎన్టీఆర్ బతికుండగానే చట్టపరంగా రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా చట్ట ప్రకారం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్య. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తే అది బతికున్న భార్యగా రాష్ట్రపతి చేత లక్ష్మీపార్వతికి అందిస్తారు. అది చంద్రబాబుకు, నందమూరి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కాబట్టి లక్ష్మీపార్వతి బతికున్నంత కాలం ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే ప్రశ్నేనంటున్నారు. మొత్తానికి లాజిక్ మాత్రం భలే ఉంది....!