'బాహుబలి' సాధిస్తున్న విజయంతో రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఇప్పుడు ఏ సినీ లవర్ నోటి నుంచి విన్నా ఆయన మాటే. ఇక 'బాహుబలి' క్రెడిట్ అందరికీ దక్కుతుంది. కానీ ప్రభాస్ నుంచి అందరూ ఆ క్రెడిట్ రాజమౌళికే ఇచ్చేశారు. కాగా గతంలో రాజమౌళి, అల్లు అరవింద్ నిర్మాతగా రామ్ చరణ్‌తో 'మగధీర' చేశాడు. కానీ ఆ క్రెడిట్‌ను యూనిట్‌లోని ఎవ్వరూ రాజమౌళికి ఇవ్వలేదు. సరికదా.. మా వల్లే ఆడింది. మా నటన వల్ల ఆడింది. రాజమౌళిని నమ్మి అన్నికోట్లు ఖర్చుపెట్టిన అల్లుగారే గ్రేట్.
ఆయన వల్లే జక్కన్న ఈ రోజు 'బాహుబలి' వంటి చాన్స్ సంపాదించాడు అనే మూర్ఖులు కూడా ఉన్నారు. తాజాగా రాజమౌళి ఎబీఎన్‌లో వేమూరి రాధాకృష్ణకు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చేశాడు. ఇది త్వరలో ప్రసారం కానుంది. ఈ ప్రోమో మాత్రం చాలా ఆసక్తిని కలిగిస్తోంది. అల్లు అరవింద్‌పై నాకు చాలా కోపాలున్నాయి. 100 డేస్‌ఫంక్షన్‌కు రానని చెప్పాను, బాహుబలిలో శివగామిగా శ్రీదేవిని పెట్టుకోకపోవడం మంచిదైంది.
రమ్యకృష్ణ అద్భుతంగా చేసింది. ఇక అమరావతికి డిజైన్లు ఇచ్చేంత వాడిని నేను కాను.నేను చదవింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. అంత పెద్ద విషయాలు నాకు తెలియదు. నాకు తెలిసింది కేవలం సినిమాలు తీయడమే అంటూ పలు మాటలు మాట్లాడాడు. మరి ఆయన ఏయో ప్రశ్నలకు, ఏయో సందర్భాలలో ఇవి చెప్పాడు అనేది పూర్తి ఇంటర్వ్యూ చూస్తేనే కానీ తెలియదు.