Advertisementt

పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాడట..!

Sat 27th May 2017 05:06 PM
pawan kalyan,director trivikram,janasena party,pawan kalyan stop movies  పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాడట..!
Pawan Kalyan in Active Politics Next to Trivikram's Film? పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాడట..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఒకపక్క పొలిటికల్ గా బిజీగా ఉంటున్న పవన్ మరోపక్క సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టినప్పటి నుండి చిన్న విరామం కూడా లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించిన న్యూస్ మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక న్యూస్ ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది. అదేమిటంటే ఇప్పుడు త్రివిక్రంతో చేసే సినిమాతో పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఆ తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమాల పరిస్థితి ఏమిటో అనే ఆలోచనతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. అయితే పవన్, త్రివిక్రమ్ సినిమా తర్వాత 2019  ఎన్నికలు సిద్ధం కావడానికే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడట. ఈ విషయంపై ఇప్పటికే తనతో సినిమాలకు కమిట్ అయిన దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేశాడట పవన్. 

పొలిటికల్ గా సక్సెస్ కావాలంటే ఇటు సినిమాలతో బిజీగా ఉంటే కుదరదని ఉద్దేశ్యంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. 2019  ఎన్నికల నాటికి జనసేనని పవర్ ఫుల్ పార్టీగా తీర్చిదిద్ది ఎన్నికల్లో విజయ డంఖా మోగించడానికి ఇప్పటి నుండే పాదయాత్రలు గట్రా చేపట్టాలనే ఉద్దేశ్యంతో పవన్ ఉన్నాడట. ఇక ఎలాగూ అనంతపురం నుండి పోటీ చేస్తానని చెప్పిన పవన్ అక్కడి నుండి జిల్లాల పర్యటనకు బయలుదేరుతాడట. మరి ఇన్ని పనుల్లో బిజీగా ఉండడంతో ఒప్పుకున్న సినిమాలకు న్యాయం చేయలేనని భావించిన పవన్ ఇలా సినిమాలకు బ్రేక్ ఇచ్చేశాడట. ఇక ఎన్నికల తర్వాత మళ్లీ పవన్ యధాతంగా సినిమాల్లో నటిస్తాడని పవన్ సన్నిహితులు చెబుతున్న మాట.

Pawan Kalyan in Active Politics Next to Trivikram's Film?:

Is Power Star Pawan Kalyan's ongoing film in the combo of ace director Trivikram, the last one of his career before making an entry into active politics? According to inside sources, Pawan Kalyan is unlikely to do another film post the completion of Trivikram's film. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ