చిరంజీవి 151వ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ జీవితం చరిత్ర ఆధారంగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కోసం పరుచూరి బ్రదర్స్ పక్కా స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని ఆగష్టు లో సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ చిత్రంపై నిర్మాత రామ్ చరణ్ కూడా పూర్తి దృష్టి సారించాడు. మరి 151వ చిత్రం ఖైదీ తో సూపర్ హిట్ కొట్టిన చిరు ఈ 151వ చిత్రం ఉయ్యాలవాడ మీద మెగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే వున్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే నిర్మాత రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అందుకోసం భారీ తారాగణాన్ని ఈచిత్రం కోసం ఎంపిక చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక చిరంజీవి పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ కోసం కూడా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. అంతే కాకుండా ఇప్పుడు ఉయ్యాలవాడ చిత్రం గురించి మరో హాట్ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. అదే మిటంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేయనున్నారని అంటున్నారు.
ఇప్పటికే అమితాబ్ కి ఉయ్యాలవాడ కథని వినిపించారని... కథ విన్న ఆయన ఉయ్యాలవాడలో నటించేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది. మరో వైపు తాను పెడుతున్న భారీబడ్జెట్ ని రాబట్టుకోవాలంటే ఈ చిత్రాన్ని తెలుగు ,తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించి విడుదల చెయ్యాలని రామ్ చరణ్ భావిస్తున్నాడట. ఇక బాలీవుడ్ లో గనక ఉయ్యాలవాడ సక్సెస్ అయితే రెండింతలు లాభాలు వస్తాయని.... అందుకే బాలీవుడ్ నటుల్ని ఇందులో నటింపజేస్తే ఈ సినిమాకి ప్లస్ అవుతుందని రామ్ చరణ్ భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.