మహేష్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్. మహేష్ 'స్పైడర్' మూవీ టీజర్ రిలీజ్ కి డేట్ దాదాపుగా ఎనౌన్సమెంట్ వచ్చేసినట్టే. సూపర్‌స్టార్ కృష్ణ బర్త్ డే (మే 31న) సందర్భంగా 'స్పైడర్' టీజర్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన పనుల్లో 'స్పైడర్' యూనిట్ బిజీగావుంది. 'స్పైడర్' టీజర్ రిలీజ్‌కు అంతా రెడీ అయినట్టు తెలుస్తోంది. 59 సెకన్లతో కూడిన టీజర్‌ను రెడీ చేసినట్టు సమాచారం. మురుగదాస్ డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ 'స్పైడర్' లో మహేష్ బాబు - రకుల్ ప్రీత్ సింగ్ లు జోడిగా నటించడమే కాకుండా తమిళం నుండి బడా స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
'స్పైడర్' చిత్రం మొదలు పెట్టి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ ఈ చిత్రం టైటిల్ దగ్గర నుండి ఫస్ట్ లుక్ పోస్టర్స్ వరకు బయటికి రావడానికి చాలా టైమే పట్టింది. దానికి మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా హంగామా చేశారు. ఎట్టకేలకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని చూసిన ఫ్యాన్స్ కాస్త శాంతించారు. మరలా ఇప్పుడు స్పైడర్ టీజర్ కోసమూ అంతే వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఎప్పటిలాగే పాత సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ కృష్ణ పుట్టినరోజున మహేష్ 'స్పైడర్' చిత్ర టీజర్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ సెట్స్ మీద ఉన్న ఏ సినిమానైనా టీజర్‌తో విష్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారట. మహేష్‌బాబు స్పై ఏజెంట్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.