అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'డీజే.. దువ్వాడ జగన్నాధం' చిత్రం ఔట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పంచ్ డైలాగ్స్ తో ఇరగదీస్తాడనే ప్రచారం మొదలైంది. డీజే లో పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తాడని ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో అర్ధమైంది. అయితే అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో మంత్రాలూ వల్లిస్తూ యాక్షన్ సీన్స్ లో కూడా ఇరగదీస్తున్నాడు. సినిమాలో చాలా వరకు అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా కనిపించనున్న పాత్ర కోసం చాలానే కష్టపడ్డాడట.
బ్రాహ్మణుడి పాత్రలో ఒదిగిపోయి నటించిన అల్లు అర్జున్ బ్రాహ్మణ పండితుడిని ట్యూటర్‌గా పెట్టుకుని బ్రాహ్మణులు మాట్లాడే విధానం, వారి ఆచార వ్యవహారాల గురించి నేర్చుకోవడమే కాక మాంసాహారానికి కూడా దూరంగా వున్నాడట. ఇలా అల్లు అర్జున్ మాంసాహారానికి దూరంగా ఉండడం చూసి డైరెక్టర్ హరీష్ శంకర్, హీరోయిన్ పూజ హెగ్డే లు ఆశ్చర్యపోయారట. అయినా సీనియర్ ఎన్టీఆర్ కూడా ఇలా శ్రీ కృష్ణుడి పాత్రలు మిగతా దేవుళ్ళ పాత్రలు వేసినప్పుడు మాంసాహారాన్ని ముట్టకపోవడం, కిందపడుకోవడం వంటి పనులు చాలా నిష్టగా చేసేవారట.
మరి ఇప్పుడు బన్నీ కూడా డీజే లో ఇలా బ్రాహ్మణుడి పాత్రని పండించడానికి మాంసాహారాన్ని త్యాగం చేశాడన్న మాట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న డీజే చిత్రానికి దిల్ రాజు నిర్మాత.