ముందుగానే నాగ చైతన్యతో తన వివాహం అక్టోబర్‌లో ఉంటుందని చూచాయగానైనా సమంతకు తెలుసో లేదో గానీ తాను ఒప్పుకున్న చిత్రాలను ఆమె పూర్తి చేయడం చూస్తుంటే ఆ అనుమానం రాకమానదు. ఆమె ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి, విశాల్ చిత్రాలలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు చివరి దశకు వచ్చాయి. ఇక విజయ్ 61వ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రంలోని పాటలను ప్రస్తుతం విదేశాలలో చిత్రీకరిస్తున్నారు. ముందుగా తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేయమని ఆమె విజయ్, అట్లీలకు ఇప్పటికే చెప్పేసిందంటున్నారు. ఇక తెలుగులో ఆమె నాగార్జున నటిస్తున్న 'రాజుగారి గది-2'లో కీలకమైన పాత్రను చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె పార్ట్ షూటింగ్ పూర్తయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ కుమార్తెలు మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీయనున్న 'మహానటి' చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.
ఆలస్యంగా మొదలైనా కూడా సమంతకు ఇబ్బంది లేదు. ఇందులో మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, సమంత కేవలం సపోర్టింగ్‌రోల్ చేస్తోంది. ఇక రామ్ చరణ్-సుకుమార్‌ల చిత్రంలోని తన పార్ట్‌ను కూడా ఆగష్టుకి పూర్తి చేయాలని చెప్పిందట. అంతేకాదు. ఆమె అడుగుపెట్టేది ఎంతో గౌరవమైన అక్కినేని కుటుంబంలోకి కాబట్టి తన చిత్రాలలో ఓవర్ ఎక్స్‌పోజింగ్, గ్లామర్ షో లేకుండా ముందు నుంచే ఆమె దర్శక నిర్మాతలకు, హీరోలకు కండీషన్స్ అప్లై అందట. సో... సమంత లౌక్యాన్ని చూసిన వారు వావ్...అంటున్నారు.