Advertisementt

బాలయ్య-పూరీ మేజిక్‌ చేయగలరా..?

Thu 25th May 2017 06:58 PM
nandamuri balakrishna,director puri jagannadh,combo movie,bhavya arts banner  బాలయ్య-పూరీ మేజిక్‌ చేయగలరా..?
Puri Jagannadh and Balakrishna's Can You Magic? బాలయ్య-పూరీ మేజిక్‌ చేయగలరా..?
Advertisement
Ads by CJ

రోజు రోజుకు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. తమ హీరోల చిత్రాలు గ్రాండియర్‌గా ఉండాలని, మరీ ముఖ్యంగా బాలయ్య వంటి మాస్‌ హీరోల సినిమాలలో యాక్షన్‌సీక్వెన్స్‌లు అదిరిపోయేలా ఉండాలని ఆశిస్తున్నారు. దీంతో కొన్నేళ్ల ముందు ఎంతో రిస్క్‌, ఖర్చుతో కూడుకుని, హాలీవుడ్‌, బాలీవుడ్‌లకే పరిమితమైన హెలికాప్టర్‌, విమానాల చేజింగ్‌లు కూడా మన సినిమాలలో కనిపిస్తున్నాయి. 

గతంలో 'ఇంద్ర'లో హెలికాప్టర్‌, రైల్‌ సీన్‌, 'జులాయి, అల్లుడు శ్రీను, మగధీర' వంటి చిత్రాలలో కూడా హెలికాప్టర్లను భారీగా వాడి సినిమాకు లావిష్‌నెస్‌ తెచ్చారు. ఇక ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో భవ్య ఆర్ట్స్‌ బేనర్‌పై ఆనంద ప్రసాద్‌ నిర్మాతగా బాలయ్య 101వ చిత్రం భారీ ఎత్తున నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికీ తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం సాధించిన విజయంతో బాలయ్య దబిడి...దిబిడే అంటున్నాడు. మరోపక్క ఇటీవల సరైన హిట్‌ లేని పూరి కూడా తన సత్తా చూపాలని కసితో పనిచేస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పోర్చుగల్‌లో భారీ ఎత్తున జరుగుతోంది. అక్కడ హెలికాప్టర్‌ ఛేజింగ్‌ సీన్స్‌ని భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని మాస్‌ పాటలు అద్భుంగా ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది. మాస్‌ హీరో బాలయ్య రెచ్చిపోతే ఇక చిత్రం ఎలా ఉంటుందో ఓ రేంజ్‌లో ఊహించుకోవచ్చు. ఇక హీరోలను, వారి గెటప్పులను, చివరకు వారి బాడీలాంగ్వేజ్‌ల నుంచి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ వరకు పూరీ ప్రజెంట్‌చేసే విధానం సూపర్‌గా ఉంటుంది. మరి ఈ చిత్రానికి ఈ హెలికాప్టర్‌ చేజింగ్‌ సీన్స్‌ అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. 

Puri Jagannadh and Balakrishna's Can You Magic?:

Natasimham Nandamuri Balakrishna's upcoming film's release date was locked to September 29 long back by its makers. Directed  by Puri Jagannadh, the film is expected to be a Dussehra treat for fans.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ