పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పాతుకుపోయాడు. 'పోకిరి' వంటి ఇండస్ట్రీ హిట్ తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పేరు మోసిన పూరి ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ ఇవ్వలేకపోయాడు. 'బిజినెస్ మ్యాన్, టెంపర్' వంటి హిట్స్ కాస్త ఊరట కలిగించినా... 'ఇజం, లోఫర్' వంటి చిత్రాలు నిరాశపరిచాయి. అయినా కూడా బాలకృష్ణ, పూరీని పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. అయితే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా హీరో అవుతానంటూ 'ఆంధ్ర పోరి' చిత్రంలో నటించి తుస్ మనిపించాడు. ఆ తర్వాత హీరోగా చెయ్యడానికి మంచి కథ కోసం వెయిట్ చేస్తూనే వున్నాడు. అయితే మంచి కథతో పూరినే తన కొడుకుని డైరెక్ట్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడట.
ఇక ఇప్పుడు పూరి గారి కూతురు పవిత్ర కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. హీరోయిన్ అవ్వాలని పవిత్ర స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందని దానికి పూరి కూడా అడ్డు చెప్పలేదనే టాక్ వినబడుతుంది. అయితే పవిత్రని హీరోయిన్ అయ్యే ముందు సినిమా ఇండస్ట్రీ ప్లస్..మైనస్ లు తెలియడానికి ఎక్స్‌పీరియన్ కోసం తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయమని కండిషన్ పెట్టాడట పూరి. ఇక ఈ కండిషన్ కి పవిత్ర కూడా ఒప్పుకుందట. అయితే అలా పూరి చెప్పాడో లేదో అప్పుడే పవిత్ర పూరి - బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం టీమ్ లోజాయిన్ అయినట్లు వార్తలొస్తున్నాయి.