ఎవరెన్ని చెప్పినా కేంద్రంలో ఎవరు పాలనలోనైనా, ఎవరు ప్రధాన మంత్రిగా ఉన్నప్పటికీ ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరాది ప్రజలను ఆకట్టుకుని వారి ఓట్లు పొందితే చాలని, దక్షిణాదిలో వస్తే వస్తాయి.. రాకపోయిన ఫర్వాలేదు.. అనే సూత్రాన్ని పాటిస్తాయి. చిదంబరం కుట్రలో భాగంగా తమిళనాడు కంటే సమైక్య ఆంధ్రా బలంగా ఉండటంతో ఆగమేఘాల మీద రాష్ట్రాన్ని అసందర్భంగా విడగొట్టారు. కనీస జాగ్రత్తలు తీసుకోలేదు.
భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను, ఇతర విషయాలలో తెలుగు వారు తెలుగు వారితో జుట్లు పీక్కునే ఎత్తుగడనే అవలంబించారు. కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైసీపీ అందరూ దీనికి దోషులే. కాగా మోదీ ప్రధానిగా అయిన తర్వాత కూడా ఆయన ఉత్తరాదిపైనే ఫోకస్ పెట్టి, అమిత్‌షా, వెంకయ్యనాయుడులకు దక్షిణాది బాధ్యతలు అప్పగించాడు. మరీ ముఖ్యవిషయం ఏమిటంటే.. నోట్ల రద్దు వల్ల దక్షిణాది ప్రజలు పడిన ఇబ్బందులు ఉత్తరాది వారు పడకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు.
తాజాగా ఓ జాతీయ దినపత్రిక నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పుడు ఎన్నికలు వస్తే మరలా మోదీనే 2014 కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడని, నోట్ల రద్దు తీవ్రత తమ మీద లేదని, మోదీ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గాయని అత్యదిక ఉత్తరాది ప్రజలు తిరిగి మోదీకే ఓటు అన్నారు కానీ తెలంగాణ, ఏపీ, తమిళనాడులలో మాత్రం బిజెపిపై అసంతృప్తి పెరుగుతోంది. నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రైతుల ఆత్మహత్యలు, సాగు, తాగు నీటి సమస్యలు పెరిగాయని వాపోయారు. కానీ ఎట్టకేలకు ఉత్తరాది చలవతో కేంద్రంలో మరోసారి మోదీ హవా స్పష్టమని చెప్పేశారు. అదీ మోదీ అంటే....!