నేడు సీనియర్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు తమ పంధా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు ఏ చిత్రమైనా ఒకే గెటప్పులో కనిపించే వారు కాస్తా మారుతున్న ప్రపంచానికి, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మేకోవర్‌లపై దృష్టిపెడుతున్నారు. విషయానికి వస్తే చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి తగ్గట్టుగా వీరత్వంతో కూడిన యోధునిగా కనిపించేందుకు మీసాలు పైకి తిప్పి, కోరమీసంతో కనించనున్నాడు.
రామ్ చరణ్ సుక్కు చిత్రంకోసం గడ్డం పెంచి, పక్కా గ్రామ యువకునిగా అవతారం ఎత్తుతున్నాడు. 'డిజె'లో బన్నీ బ్రాహ్మణ యువకునిగా,స్లైలిష్‌లుక్‌తో అదరగొడుతున్నాడు. బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో మారి తన విగ్ నుంచి మీసాల వరకు లుక్ మారుస్తున్నాడు. ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రంలో సంకెళ్లు వేసుకుని, కోరమీసంతో రఫ్ఫాడిస్తున్నాడు.
'180' చిత్ర దర్శకుడు, యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర పంచకేశన్ ఆరేళ్ల తర్వాత మరలా మెగాఫోన్ చేతబట్టి పి.సి.శ్రీరాం వంటి కెమెరామెన్‌తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో కథే కాదు.. కళ్యాణ్ రామ్ గెటప్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందట. ఇప్పటికే ఈ హీరో 'ఇజం'లో కొత్తగా కనిపించాడు. ఎన్టీఆర్ 'టెంపర్' నుంచి లైన్‌లోకి వచ్చినట్లే తమ్ముడి రూట్‌లోకి అన్నయ్య వస్తున్నాడు.