మంచి బేకప్, మెగా మేనల్లుడు అనే బిరుదు, ముఖ్యంగా చిన్న మవయ్య పవన్ కళ్యాణ్‌ల సాయంతో సాయి ధరమ్ తేజ్ వైవిఎస్ చౌదరితో 'రేయ్' చిత్రం చేశాడు. సినిమా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నందువల్ల పవన్ ఆర్దిక సాయం కూడా చేశాడు. కానీ ఆ చిత్రం కంటే ముందే ఆయన నటించిన రెండో చిత్రం విజయం సాధించింది. ఆ తర్వాత దిల్‌రాజు అండతో 25కోట్ల మార్కెట్‌కు ఎదిగాడు. మెగా ఫ్యామిలీలో మంచి ఫ్యూచర్, బాడీలాంగ్వేజ్‌లతో పాటు చక్కని డ్యాన్సింగ్ ప్రతిభ, ఉన్న నటునిగా మెప్పించాడు.
కానీ సడన్‌గా 'తిక్క, విన్నర్' చిత్రాలతో తిరుగేలేని దెబ్బతిన్నాడు. రవి మొదటి చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ రచయిత బి.వి.ఎస్.రవికు దర్శకునిగా మరో అవకాశం ఇస్తూ 'జవాన్' చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయనపై మాస్ ఇమేజ్ ఉంది. దాని పక్కనపెట్టే యోచనలో ఉన్న ఆయన లవ్ చిత్రాల స్పెషలిస్ట్ కరుణా కరన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. పవన్‌కి తొలి బంపర్ హిట్టును ఇచ్చి, ఆయనను యూత్‌లో ఐకాన్‌గా చేసిన చిత్రం 'తొలిప్రేమ' అన్న విషయం అందరికీ తెలిసిందే.
కానీ ఆ తర్వాత మాత్రం రెండు మూడు యావరేజ్‌లు తప్ప కరుణా కరన్‌కి మంచి హిట్టు లభించలేదు. ఇటీవల ఆయన రామ్‌తో ఓ చిత్రం చేయాలని భావించాడు. కానీ ఇప్పటికే రామ్‌కి ఓ డిజాస్టర్ ఇవ్వడంతో రామ్ బాగా వెయిట్ చేయించాడు. ఇప్పుడు అదే కథతో కరుణా కరన్ తేజూతో ఓ చిత్రం చేయనున్నాడు.తన చిన్న మామకి ఇచ్చిన హిట్టుని మించిన హిట్టు తనకు మరో సారి ఇస్తాడని తేజు భావిస్తున్నాడట.