కొందరు సినీ ఫీల్డ్‌లో ఉన్నవారు ఉన్నట్లుండి పరిశ్రమకు దూరమవుతుంటారు. దాంతో వారిపై మనం ఓ ముద్ర వేస్తాం. టాలీవుడ్ అంటే ఇష్టం లేదని, బోలెడు రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేస్తోందని, నిర్మాతలను ఇబ్బంది పెడుతోందని అకారణంగా నిందలేస్తుంటారు. ఇవి చాలా మంది విషయంలో నిజమైనప్పటికీ కొందరు మాత్రం తమ ప్రమేయం లేకుండానే దేవుని విధి రాత వల్ల దూరమైపోతుంటారు. ఇక బాలీవుడ్‌లో 'లక్కీ'లో నటించిన స్నేహ ఉల్లాల్ అచ్చు ఐశ్వర్యారాయ్‌లా ఉంటుంది.
దీంతో ఆమెను జూనియర్ ఐశ్వర్యా అని కూడా చాలా మంది పిలిచేవారు. కాగా అప్పటికే ఐశ్వర్యారాయ్‌తో బంధం తెంపేసుకున్న సల్మాన్ ఖాన్ వంటి వారు కూడా ఆమెకు అండగా నిలిచారు. కానీ ఎప్పుడు నీరసంగా ఉండే ఆమె ఏదో వ్యాధితో బాధపడుతోందని ఎవ్వరూ గుర్తించలేదు. ఆమెకు పొగరు ఎక్కువ. అందుకే సినిమాలు చేయడం లేదు అన్నారు. తెలుగులో ఆమె చేసిన 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా'తో పాటు బాలయ్యతో పాటు కూడా నటించి మూడు నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో హఠాత్తుగా మాయమైంది.
ఆమెకు రక్త సంబంధిత వ్యాధి ఉందని, ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల తానంత తానుగా కనీసం 30 నిమిషాలు కూడా సొంతంగా నిలబడలేకపోయానని మనసు విప్పింది. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యానని ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఇప్పుడు అంతా ఓకే అయినా ఆమెకు ఎవరు చాన్స్‌లిస్తారనేది ప్రశ్నార్ధకమే.