మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం షూటింగ్ చివరి దశలో వుంది. అయితే ఈ మధ్యనే 'స్పైడర్' షూటింగ్ ఆలస్యమవడంతో మహేష్, మురుగదాసుపై గుర్రుగా ఉన్నాడనే వార్తలు ప్రచారం జరిగాయి. అయితే మురుగదాస్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించడం వల్ల ఈ చిత్రం షూటింగ్ కొద్దిగా ఆలస్యమవుతుందని అంటున్నారు. అంతే కాకుండా మురుగదాస్ కొన్ని సీన్స్ ని మరలా మరలా రీ షూట్ చెయ్యడం వలన షూటింగ్ ఆలస్యమైనట్లు కూడా ప్రచారం జరిగింది. ఇక ఈ చిత్రం లో మహేష్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సారి జోడి కడుతుంది.
పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా సాగనున్న ఈ చిత్రంలో పాటలకు పెద్ద స్కోప్ లేనట్లు తెలుస్తోంది. కథకు తగ్గట్టు పాటలను పెట్టినట్లు తెలుస్తోంది. 'స్పైడర్' లో కేవలం నాలుగు పాటలే వుంటాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో హీరో పై ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుందని.... అలాగే ఒక డ్యూయెట్ కూడా వుంటుందట. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఓ డ్యూయట్, మాంటేజ్ సాంగ్ ఉంటాయట. మరి మహేష్ బాబు చిత్రంలో కేవలం నాలుగు పాటలే ఉంటాయంటే బాగోదని మరో పాటని చేరిస్తే బావుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ పాటను రోలింగ్ టైటిల్స్ టైమ్ లో ప్లే చేస్తే బెటర్ అన్న ఆలోచనలోమురుగదాస్ అండ్ టీమ్ ఉన్నట్లు తెలుస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ అందాలు కేవలం రెండు డ్యూయెట్స్ లోనే చూపిస్తే కుర్రకారు సాటిస్ఫాయ్ అవ్వరు కాబట్టి ఇలా మరో సాంగ్ కి ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మహేష్ - రకుల్ నడుమ రొమాంటిక్ సాంగ్స్ ఉంటె బావుంటుందని అంటున్నారు. చూద్దాం 'స్పైడర్' సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.