ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలను ఇటీవలే చేపట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాద్‌ని కొందరు ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని, మరి కొందరు పక్కా హిందుత్వ వాది అని ముద్ర వేస్తున్నారు. కానీ ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న చర్యలు పలువురికి నిద్రను కరవు చేస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, శ్యాంప్రసాద్ ముఖర్జీలు లేకుంటే ఇప్పటి భారత్‌లోని పంజాబ్, కాశ్మీర్, పశ్చిమబెంగాల్‌లు కూడా మన నుంచి విడిపోయి వుండేవని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
కేంద్రప్రభుత్వం ప్రకటించే సెలవుదినాలు తప్ప ఇతర సెలవులపై ఉక్కుపాదం మోపాడు. కావాలంటే వారానికి ఐదు రోజుల పనిదినాలు ఇవ్వడానికైనా రెడీ అని, అంతేకానీ ఎవరి జయంతులనో, లేక పండుగలను పురస్కరించుకుని సెలవులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించాడు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏయస్‌లు సహా వారి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలంటున్నాడు. త్వరలో ఈ షరత్తును రాజకీయ నాయకుల పిల్లలకు కూడా వర్తింపజేస్తానంటున్నాడు.
ఇక వాహనాలను హెల్మెట్స్ లేకుండా, కార్లలో సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణించే వారికి ఆయిల్‌ని ఇవ్వకూడదని పెట్రోల్ బంకులను ఆదేశించాడు. అంతేకాదు.. అలాంటి వాహనాల నెంబర్లను తమకు తెలియజేయాలని పెట్రోల్ బంకులను ఆదేశించాడు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద ఓ ఎస్‌ఐ స్థాయి అధికారిని పర్యవేక్షణకు ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. సూపర్.. యోగి.. యూ ఆర్ గ్రేట్....!