ఇతర భాషా దర్శకులు మరీ ముఖ్యంగా నిత్యం కొత్తదనంతో సినిమాలు తీస్తే మలయాళ క్రియేటివ్ దర్శకుల చిత్రాలు తెలుగులో సరిగా ఆడవు. పైగా ఆయా దర్శకులకు చెడ్డపేరు తెస్తున్నాయి. ఇక మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌కి మలయాళంలో ఎంతో పేరుంది. ఆయన పేరును చూసి సినిమాలకు వెళ్లే వారు ఎందరో ఉన్నారు. ఇక ఈయన సౌత్ ఇండియన్ చిత్రాల రీమేక్‌ల ద్వారా బాలీవుడ్‌లో కూడా ఫేమస్. ఇక ప్రియదర్శన్‌లోని టాలెంట్‌ను చూసిన నాగార్జున అప్పుడెప్పుడో 'నిర్ణయం' అనే చిత్రం చేశాడు.
అవుట్ అండ్ అవుట్ కామెడీ, మ్యూజికల్ హిట్టయిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించింది. ఇక ఇందులోని 'హలో గురూ ప్రేమ కోసమేరో జీవితం...' పాట ఎవర్‌గ్రీన్. ఆ తర్వాత ప్రియదర్శన్ దర్శకత్వంలో ఏయన్నార్, బాలకృష్ణ, రోజా, ఓ పాటలో మోహన్‌లాల్‌లు నటించిన 'గాండీవం' వచ్చింది. రిలీజ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు ఫ్లాప్ అయింది. అంటే ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన రెండు తెలుగు చిత్రాలలో ఒకటి జస్ట్ ఓకే అనిపిస్తే, మరోటి డిజాస్టర్ అయింది.
అప్పటి నుంచి ఆయన మరలా టాలీవుడ్‌లో చిత్రం చేయలేదు. ఇక ఆయన ఇటీవల మోహన్‌లాల్‌ను గుడ్డివానిగా చూపిస్తూ మలయాళంలో తీసిన థ్రిల్లర్ మూవీ 'కనుపాప'గా విడుదలైంది. తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేష్ 'గురు' చిత్రం తర్వాత మరో చిత్రం ఒప్పుకోలేదు. క్రిష్, పూరీ, కిషోర్ తిరుమల చిత్రాలు వార్తలకే పరిమితం అయ్యాయి. తాజాగా వెంకీ ప్రియదర్శన్‌కి ఫోన్ చేసి తన కోసం ఓ వెరైటీ సబ్జెక్ట్‌ని తయారు చేయమని కోరాడట. ఇది వర్కౌట్ అయితే టాలీవుడ్‌లోని సీనియర్ స్టార్స్‌లో చిరు తప్ప మిగిలిన ముగ్గురి చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం ప్రియదర్శన్‌కి దక్కినట్లవుతుంది.