తన తండ్రి రీలాంఛ్ మూవీ 'ఖైదీ నెంబర్150'తో నిర్మాతగా డబ్బుల రుచి మరిగాడు రామ్ చరణ్. కాగా ప్రస్తుతం తన తండ్రితో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని మొదలుపెట్టనున్నాడు. స్టోరీ దాదాపు ఫైనల్ కావచ్చింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఆగష్టులో చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారని సమాచారం. ఇక నటీనటులనే కాకుండా ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్‌డైరెక్టర్స్‌గా పలువురు ప్రముఖులను పెట్టుకున్నారు.
కెమెరామెన్‌గా కూడా బాలీవుడ్‌కి చెందిన రవి వర్మన్‌ని ఎంపిక చేశారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. దీనికోసం ఆయా భాషల్లోని ప్రముఖులను ఎంపిక చేసుకుంటూ తమ చిత్రానికి షూటింగ్ మొదటి రోజు నుంచే భారీ హైప్ తేవడానికి రెడీ అవుతున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని కొణిదెల బేనర్‌లో నిర్మిస్తూ, తమిళ వెర్షన్‌కి లైకా మూవీస్‌ను సంప్రదిస్తున్నారు. తమిళ 'కత్తి'కి రీమేక్‌గా తయారైన ఖైదీ నెంబర్ 150కి కూడా లైకా ప్రొడక్షన్స్ భాగస్వామ్యం వహించి, బాగానే లాభాలు గడించింది.
ఇక ఈ అధినేతలతో అల్లు అరవింద్‌కు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం లైకా సంస్థ శంకర్, రజనీ, అక్షయ్ కుమార్‌లతో '2.0' చిత్రాన్ని 400కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. త్వరలో నాగశౌర్య-సాయిపల్లవిల కాంబినేషన్‌లో ఓ ద్విభాషా చిత్రాన్ని ప్రారంభించనుంది. ఇక 'ఉయ్యాలవాడ' బాలీవుడ్ వెర్షన్ కోసం ధర్మప్రొడక్షన్స్‌కి చెందిన కరణ్ జోహార్‌తో మంతనాలు జరుగుతున్నాయని టాక్.